హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు సహాయక పాత్రల్లోనూ మెప్పిస్తున్నాడు అక్కినేని యంగ్ హీరో సుశాంత్. కరెంట్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యేడు సుశాంత్. ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది. తొలి సినిమాతోనే నటన, యాక్టింగ్తో ప్రేక్షకులను అలరించాడు సుశాంత్. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ మంచి హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. చాలా కాలం తర్వాత చిలసౌ అనే సినిమాతో మళ్లీ హిట్ అందుకున్నాడు. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సుశాంత్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో సైడ్ రోల్ లో నటించి మెప్పించాడు. తాజాగా రావణాసుర సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు.
తొలిసారి నెగిటివ్ పాత్ర చేస్తున్న సుశాంత్ ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే సుశాంత్ తన కెరీర్ లో ఓ బిగ్ సినిమాను మిస్ చేసుకున్నాడట. ఆ సినిమాను మరో యంగ్ హీరో చేసి హిట్ అందుకున్నాడు ఇంతకు ఆ సినిమా ఏంటి.? ఆ హీరో ఎవరో తెలుసా.?
యంగ్ హీరో శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమా మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఛాన్స్ ముందుగా సుశాంత్ కు వచ్చిందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులో నటించలేకపోయానని తెలిపాడు సుశాంత్. ఆ తర్వాత శర్వా ఆ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు సుశాంత్.