Suriya Sivakumar : గ్రాండ్‌గా సూర్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌లుగా ఎవరంటే..

|

Mar 03, 2022 | 7:02 PM

స్టార్ హీరో సూర్య  నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇతరుక్కుమ్ తునింధవన్'. ఈ సినిమాను తెలుగులో ఈటీ అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు.

Suriya Sivakumar : గ్రాండ్‌గా సూర్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌లుగా ఎవరంటే..
Et
Follow us on

Suriya Sivakumar : స్టార్ హీరో సూర్య  నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇతరుక్కుమ్ తునింధవన్’. ఈ సినిమాను తెలుగులో ఈటీ అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈసినిమాను నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10, 2022న ఒకేసారి విడుదల కానుంది ఈటీ. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ మేరకు నేడు ఈటీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు , మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, హీరో రానా ముఖ్య అతిథులు గా హాజరుకానున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో ఈ సినిమాలో సత్యరాజ్.. శరణ్య .. రాజ్ కిరణ్.. సూరి ముఖ్యమైన పాత్రలను పోషించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT: ప్రేక్షకులకు షాక్.. ఆగిపోయిన బిగ్‏బాస్ నాన్‏స్టాప్.. కారణం చెప్పిన నిర్వాహకులు..

Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..