AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya : మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో.. ఆ లేడీ డైరెక్టర్‌తో సూర్య సినిమా..?

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. నటనకు ఆస్కారం ఉన్న కథాంశాలనే ఎన్నుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు.

Suriya : మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో.. ఆ లేడీ డైరెక్టర్‌తో సూర్య సినిమా..?
Hero Suriya
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2022 | 9:51 AM

Share

తమిళ్ స్టార్ హీరో సూర్య(Suriya )ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. నటనకు ఆస్కారం ఉన్న కథాంశాలనే ఎన్నుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఒక్కోసారి ఆ సినిమాలు బెడిసి కొట్టినా పట్టు వదలరు. సినిమాకి, సినిమాకి తన పాత్రలో వేరియేషన్స్‌ చూపిస్తుంటారు. ఆ మధ్య కాలంలో సూర్య నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోయాయి. అదే సమయంలో లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు సూర్య. ఆ సినిమానే ఆకాశం నీ హద్దురా.. తమిళంలో రూపొందిన ‘సూరారై పోట్రు’. ఈ సినిమాను ‘ఆకాశం నీ హద్దురా!’ పేరిట తెలుగులోకి అనువాదం చేశారు. సూర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. నవంబర్ 11వ తేదీన ఈ సినిమా ఓటీటీలోస్ట్రీమింగ్ అయ్యింది. కెప్టెన్ గోపినాథ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

సుధ కొంగరకు ఈ సినిమా తర్వాత పెద్ద హీరోలనుంచి ఆఫర్లు వచ్చాయి. ఆమధ్య ఆమె మహేష్ బాబు తో ఓ సినిమా చేయబోతున్నారని టాక్ వినిపించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా ఉండే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి.. సూర్య సినిమా తర్వాత ఆమె సినిమాలు ఏమీ చేయలేదు మధ్యలో ఓటీటీ కంటెంట్ కు దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు మరోసారి ఆమె సూర్య తో సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య తో ఒక పక్కా కమర్షియల్ మూవీని ఆమె చేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈటీ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. ఇప్పుడు బాల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుధ కొంగరతో సూర్య సినిమా చేసే ఛాన్స్ ఉందని కోలీవుడ్ టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: హిందీలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల జాతర.. కొవిడ్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో సినిమాగా..

Anasuya Bharadwaj: కుర్రకారు గుండెలను కొల్లగొడుతున్న యాంకరమ్మ గ్లామర్ షో.. తగ్గేదేలే అంటున్న అను

Sreemukhi: ఖతర్నాక్ పోజులతో కైపెక్కిస్తున్న శ్రీముఖి.. యాంకరమ్మ అందాలకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్