Suriya 45: సూర్య సినిమా లేటెస్ట్ అప్డేట్.. 500 మందితో అదిరిపోయే సాంగ్

|

Mar 22, 2025 | 8:20 AM

కోలీవుడ్ నటుడు సూర్య 45వ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన దర్శకత్వంలో వస్తున్న మూడవ సినిమా. ఆయన గతంలో మూకుతి అమ్మన్, వీతుల విశేష చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా త్రిష నటిస్తుంది.

Suriya 45: సూర్య సినిమా లేటెస్ట్ అప్డేట్.. 500 మందితో అదిరిపోయే సాంగ్
Surya 45
Follow us on

హీరో సూర్య, ఆర్జే బాలాజీ కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. చివరిగా సూర్య కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు సూర్య లేటెస్ట్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత ఆర్జే బాలాజీ సినిమా చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. ఈ సినిమా డిఫరెంట్ కథతో తెరకెక్కుతుంది. ఈ సినిమా సూర్య కెరీర్‌లో 45వ చిత్రం గా తెరకెక్కనుంది.

ఇది కూడా చదవండి : 55 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గానే.. స్టార్ హీరోల్లోనూ యమా క్రేజ్.. ఆమె ఎవరంటే

అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏ.ఆర్. రెహమాన్ ను ఎంపిక చేశారు. రెహమాన్ మ్యూజిక్ సినిమాకి మరింత హైప్‌ను తెచ్చిపెట్టింది. ఈ ప్రాజెక్ట్ గురించి 2024 అక్టోబర్ 14న సన్ న్యూస్ తమిళం ద్వారా అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆర్జే బాలాజీ, గతంలో “రన్ బేబీ రన్” వంటి విజయవంతమైన చిత్రాల్లో నటుడిగా, దర్శకుడిగా తన సత్తా చాటాడు. నయనతారతో ఆయన చేసిన ముక్కుత్తి అమ్మన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు సూర్యతో ఆర్జే బాలాజీ కాంబినేషన్ పట్ల సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.

ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో చాలా భిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది.  ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఫెస్టివల్ సెట్‌లో పాటను చిత్రీకరించనున్నట్లు, నటి త్రిష, సూర్య కలిసి జానపద పాటకు నృత్యం చేస్తారని తెలుస్తుంది. అలాగే ఈ పాట 500 మందికి పైగా డాన్సర్స్ తో ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివారాలు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..