Aham Reboot: ఆకట్టుకుంటున్న అహం రీబూట్ ఫస్ట్ గ్లింప్స్.. సరికొత్తగా వస్తోన్న అక్కినేని హీరో..

మీ ఆలోచనలు కూడా ప్రసారం అవుతాయి.. అని రేడియో సృష్టికర్త మార్కొని చెప్పిన కొటేషన్ తో ఫస్ట్ గ్లిట్చ్ మొదలైంది. ఇందులో సుమంత్ ఆర్జే నిలయ్ పాత్రలో కనిపిస్తున్నారు. కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు కాపాడమంటూ

Aham Reboot: ఆకట్టుకుంటున్న అహం రీబూట్ ఫస్ట్ గ్లింప్స్.. సరికొత్తగా వస్తోన్న అక్కినేని హీరో..
Aham Reboot

Updated on: Jun 16, 2022 | 12:48 PM

ఇటీవల మళ్లీ మొదలైంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాడు సుమంత్ (Sumanth).. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ఆహాం రీబూట్.. డైరెక్టర్ ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం “అహం రీబూట్” (Aham Reboot) సినిమా విడుదల సన్నాహాల్లో ఉంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లిట్చ్ (ఫస్ట్ గ్లింప్స్) టీజర్ ను హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. కాన్సెప్ట్ ను తెలుసుకొని టీమ్ ని అభినందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం జూలై లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

మీ ఆలోచనలు కూడా ప్రసారం అవుతాయి.. అని రేడియో సృష్టికర్త మార్కొని చెప్పిన కొటేషన్ తో ఫస్ట్ గ్లిట్చ్ మొదలైంది. ఇందులో సుమంత్ ఆర్జే నిలయ్ పాత్రలో కనిపిస్తున్నారు. కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు కాపాడమంటూ ఒక యువతి ఆర్జే నిలయ్ కు ఫోన్ చేస్తుంది. ఇలాగే ప్రమాదంలో ఉన్న చాలా మంది యువతులు కథానాయకుడి సాయాన్నిరేడియో ద్వారా కోరుతుంటారు. మరి వాళ్లను అతను ఎలా కాపాడాడు అనేది ఆసక్తి కరంగా ఉండబోతోంది. ఈ ప్రయోగాత్మక చిత్రం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఒక యునిక్ కాన్సెప్ట్ ను థ్రిల్లింగ్ గా ప్రజెంట్ చేయడం అహం రీబూట్ కి బలంగా మారుతుంది అని టీమ్ నమ్ముతుంది. హీరో సుమంత్ నటన ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు.

\

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.