దాసరి నారాయణరావు తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో ఇండస్ట్రీ పెద్ద ఎవరనే చర్చ గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయంలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ ఎన్నికల సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని, కానీ పరిశ్రమలోని కార్మికులకు, వ్యక్తులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని అన్నారు. అదే సమయంలో నరేష్ లాంటి కొందరు వ్యక్తులు ఇండస్ట్రీ పెద్దగా మోహన్‌బాబు అయితే బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత ఈ వ్యవహారం సద్దుమనిగినప్పటికీ అప్పుడప్పుడు కొందరు నటులు దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీ పెద్ద అంశంపై హీరో శ్రీకాంత్ (Srikanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దాసరి తర్వాత మెగాస్టారే..
‘నా వరకు ఇండస్ట్రీ పెద్ద ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారి పేరే చెబుతాను. ఎందుకుంటే ఆయన చాలా కాలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా కనిపించేది మెగాస్టార్‌నే. ఆయనను కలిసే తమ సమస్యలు పరిష్కారించాలని కోరతారు. అన్నయ్య కూడా వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అందుకే దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి అనడంలో తప్పులేదు. ఇటీవల టికెట్ రేట్ల అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం చిరంజీవినే ముందుగా ఆహ్వానించింది. దీన్ని బట్టి సినిమా పరిశ్రమలో ఆయన స్థానం ఏంటన్నది అర్థమవుతోంది’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. కాగా ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసి గెలిచాడు శ్రీకాంత్. అయితే గెలిచిన వెంటనే ప్రకాశ్ ప్యానల్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Telangana: అంతా ఒరిజినల్ అన్నారు.. ఢోకా లేనే లేదన్నారు.. చివరకు వారు చేసి పని ఇది..!
Russia – Ukraine Conflict: పారిపోను.. ఆయుధాలివ్వండి.. అమెరికా ఆఫర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి రిప్లై..