Satya Dev: హీరో సత్యదేవ్‌ భార్య, కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో? వైరలవుతోన్న ఫొటో

|

Feb 09, 2023 | 7:35 AM

సత్యదేవ్ సినిమా కెరీర్‌ అందరికీ తెలుసుకానీ అతని వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియదు. పైగా ఎప్పుడు తన కుటుంబం గురించి ఎప్పుడూ నోరు విప్పలేదు. దీంతో సత్యదేవ్‌కు పెళ్లయిందనే విషయం చాలా మందికి తెలియదు.

Satya Dev: హీరో సత్యదేవ్‌ భార్య, కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో? వైరలవుతోన్న ఫొటో
Hero Satyadev
Follow us on

టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అతి తక్కువ సమయంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్‌గా, సపోర్టింగ్‌ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. గాడ్‌ఫాదర్‌ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవిని ఢీకొట్టి మెప్పించిన సత్యదేవ్‌ ఇటీవల గుర్తుందా శీతాకాలం అంటూ ఫ్యాన్స్‌ను పలకరించాడు. ప్రస్తుతం అతను కృష్ణమ్మ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు ఫుల్‌ బాటిల్‌ అనే మరో సినిమాకు పచ్చజెండా ఊపాడు. కాగా సత్యదేవ్ సినిమా కెరీర్‌ అందరికీ తెలుసుకానీ అతని వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియదు. పైగా ఎప్పుడు తన కుటుంబం గురించి ఎప్పుడూ నోరు విప్పలేదు. దీంతో సత్యదేవ్‌కు పెళ్లయిందనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఇటీవల గుర్తుందా శీతాకాలం మూవీ ప్రమోషన్లలో తన భార్య దీపికను పరిచయం చేశాడు సత్యదేవ్‌. తాజాగా తన కొడుకును కూడా ఇంట్రడ్యూస్‌ చేశాడు. బుధవారం(ఫిబ్రవరి 8) కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా భార్య, కొడుకుతో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు.

‘సవర్ణిక్ మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు. నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తన తనయుడికి బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు సత్యదేవ్‌. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సత్యదేవ్ ఫ్యామిలీ ఎంతో క్యూట్‌గా ఉందంటూ, చూడముచ్చటైన జంట అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన సత్యదేవ్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. ఐబీమ్‌, వీఎమ్‌వేర్‌ వంటి ఐటీ దిగ్గజ సంస్థల్లో పనిచేశాడు. అయితే సినిమాపై మక్కువతో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న రోల్స్‌తో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోగానూ మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..