RAM Tweet: హీరో రామ్ ఇంట్లో విషాదం.. తాతయ్య‌ మృతిపై ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసిన హీరో..

|

May 18, 2021 | 12:45 PM

RAM Tweet: హీరో రామ్ పోతినేని ఫ్యామిలీలో విషాదం నెల‌కొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న రామ్ తాత‌య్య ఈరోజు (మంగ‌ళ‌వారం) మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని రామ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా...

RAM Tweet: హీరో రామ్ ఇంట్లో విషాదం.. తాతయ్య‌ మృతిపై ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసిన హీరో..
Ram Emotional Post
Follow us on

RAM Tweet: హీరో రామ్ పోతినేని ఫ్యామిలీలో విషాదం నెల‌కొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న రామ్ తాత‌య్య ఈరోజు (మంగ‌ళ‌వారం) మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని రామ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించాడు. త‌న తాత‌తో ఉన్న అనుబంధాన్ని అభిమానుల‌తో పంచుకున్న రామ్‌.. కుటుంబం కోసం ఆయ‌న ప‌డ్డ క‌ష్టాన్ని వివ‌రించాడు. ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా రామ్ చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్ గుండెల‌కు హ‌త్తుకుంటోంది.
ఇంత‌కీ రామ్ చేసిన ట్వీట్ ఏంంటే.. తాత‌య్య నువ్వెప్ప‌టికీ మా గుండెల్లో రాజులా మిగిల‌పోతారు. మీరు విజ‌య‌వాడ‌లో లారీ డ్రైవ‌ర్‌గా జీవితం ప్రారంభించిన స‌మ‌యంలో లారీ టైర్ల‌పైనే నిద్ర‌పోయేవారు. మీ కుటుంబ‌స‌భ్యులకు అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పించ‌డానికి మీరు ఇలాంటి ఎన్నోత్యాగాలు చేశారు. డ‌బ్బు ఉంటేనే ధ‌న‌వుంతులు కార‌నీ… మంచి మ‌న‌సు ఉన్న వారే నిజ‌మైన శ్రీమంతులు అని మాకు నేర్పించారు. మీ పిల్ల‌ల‌ను ఉన్న‌త స్థాయిలో ఉంచేందుకు మీరు క‌న్న క‌లలు నేడు నేర‌వేరాయి. మీరు లేర‌న్న వార్త న‌న్ను ఎంతో బాధిస్తోంది. మీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను అంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశాడు రామ్‌.

తాత‌య్య మ‌ర‌ణంపై రామ్ చేసిన ట్వీట్..

 

Also Read: SonuSood Foundation: సోనూసూద్ ఫౌండేష‌న్ పేరుతో న‌కిలీ విరాళాల సేక‌ర‌ణ‌.. ఫ్యాన్స్‌ను అల‌ర్ట్ చేసిన సోనూ…

Ileana Food Business: ఫుడ్ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న గోవా బ్యూటీ.. లాక్‌డౌన్ త‌ర్వాత‌.?

Vaccine For Pregnant Women: గ‌ర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా..? ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చిన‌ బాలీవుడ్ భామ‌..