యంగ్ హీరో నితిన్(Hero Nithin )నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. చాలా కాలంగా నితిన్ సాలిడ్ హిట్ లేక సతమతం అవుతున్నారు. భీష్మ సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేక పోయాడు నితిన్. . దాంతో ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఎలాగైనా హిట్ అనుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, మాచర్ల యాక్షన్ థీమ్ కు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమా పెయిన్ అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి. నితిన్ ఈ సినిమా చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారు. ఈ మూవీలో కావల్సినంత యాక్షన్ తోపాటు లవ్ అండ్ కామెడీ మిక్స్ చేశారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నితిన్ తన సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.
నితిన్ మాట్లాడుతూ.. “ఇరవై ఏళ్ళుగా ఇండస్ట్రీలో వున్నా. ప్రేమ కథలు చేసి కొంత బోర్ ఫీలింగ్ వచ్చింది. డిఫరెంట్ గా చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాలనే అలోచనతో ‘మాచర్ల నియోజకవర్గం’ చేశా. ఇది ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ. పవర్ ఫుల్ రోల్. మాస్ ఎలిమెంట్స్ అన్నీ వున్నాయి అన్నారు. అలాగే కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో వుండే కథ చాలా యూనిక్ వుంటుంది. పొలిటికల్ నేపధ్యంలో ఇది వరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ మాచర్ల లో వుండే పాయింట్ చాలా కొత్తగా వుంటుంది. కమర్షియల్ ఫార్మెట్ లో ఉంటూనే కొత్త పాయింట్ తో వుంటుంది. నా పాత్ర విషయంలో దర్శకుడు శేఖర్ చాలా హోం వర్క్ చేశారు. చాలా మంది ఐఎఎస్ అధికారులని కలవడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి, షూటింగ్ సమయంలో ఎక్కడ హుందా గా వుండాలి, ఎక్కడ మాస్ గా ఉండాలనేది తనే చెప్పాడు. కోవిడ్ తర్వాత ప్రేక్షకుల మూడ్ స్వింగ్ ఏమిటో అర్ధం కావడం లేదు. ఏ సినిమా చూస్తున్నారు.. ? ఏ సినిమాకి వస్తున్నారో సరిగ్గా అర్ధం కావడం లేదు. టీజర్, ట్రైలర్ లో ఏదో నచ్చి వస్తున్నారు. సినిమా నచ్చితే అది నడుస్తుంది. అయితే ఏ సినిమా నడుస్తుందనేది ఊహించలేం.. కోవిడ్ తర్వాతే కమర్షియల్ సినిమాకి ఇంకా స్కోప్ పెరిగింది. సాఫ్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. మాస్, హ్యుమర్, కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయి అని అన్నారు నితిన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి