Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తానన్న సారా.. లైగర్ రిప్లే చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ.. ఈ పేరు వినగానే ఒకప్పుడు అర్జున్ రెడ్డి పేరు వినిపించేది. ఇప్పుడు లైగర్. ఈ లైగర్ కారణంగానే టాలీవుడ్ టు బాలీవుడ్.. ఎక్కడ చూసినా విజయ్ పేరు మారుమోగిపోతుంది.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ.. ఈ పేరు వినగానే ఒకప్పుడు అర్జున్ రెడ్డి పేరు వినిపించేది. ఇప్పుడు లైగర్. ఈ లైగర్ కారణంగానే టాలీవుడ్ టు బాలీవుడ్.. ఎక్కడ చూసినా విజయ్ పేరు మారుమోగిపోతుంది. తనదైన నటన, మ్యానరిజంతో తెలుగునాట ఎంతో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. లైగర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నాడు. అంతకంటే ముందు.. లైగర్ కారణంగా కొన్నాళ్లుగా ముంబైలోనే ఉంటున్న విజయ్.. బీటౌన్ లో మోత మోగిస్తున్నాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. లేడీస్ ఫాలోయింగ్ గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తనదైన స్టైల్‌తో బిటౌన్ హీరోయిన్ల మనసు కొల్లగొడుతున్నాడు ఈ యంగ్ స్టార్.
ఇటీవల బాలీవుడ్ స్టార్ బ్యూటీ సారా అలీ ఖాన్.. విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుందంటూ కరణ్ జోహార్ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. సారా తో పాటు.. జాన్వీ కపూర్ సైతం అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే, సారా కామెంట్‌పై తాజాగా లైగర్ స్పందించాడు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్.. సారా కు టెక్ట్స్ చేశానని చెప్పాడు. ఆమె చాలా చెప్పడం స్వీట్‌గా ఉందన్నాడు. అదే సమయంలో నిజంగా సారా తో డేట్ చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. చాలా తెలివిగా రెస్పాండ్ అయ్యాడు. “నేను ‘రిలేషన్‌షిప్’ అనే పదాన్ని కూడా సరిగా చెప్పలేను. ఒకరితో రిలేషన్‌లో ఎలా ఉండగలను?” అని బదులిచ్చాడు. అంతకుముందు.. ఇన్‌స్టాగ్రమ్‌లో స్టోరీ పోస్ట్ చేసిన విజయ్.. ‘నాపై ఇంతటి అభిమానం చూపిస్తున్న మీకు నా గట్టి హగ్, ప్రేమ పంపిస్తున్నా’ అంటూ హార్ట్ సింబర్ పెట్టి క్యాప్షన్ ఇచ్చాడు.
‘కాఫీ విత్ కరణ్’ షోలో మీరు డేటింగ్ చేయాలనుకుంటున్న వారి పేరు చెప్పండి? అంటూ సారాను కరణ్ ప్రశ్నించాడు. దానికి స్పందించిన సారా అలీ ఖాన్ సిగ్గుపడుతూ.. వద్దు, లేదు అంటూనే విజయ్ దేవరకొండ పేరును చెప్పింది. ఆ తరువాత జాన్వీ కపూర్‌ను కూడా అదే ప్రశ్న వేయగా.. సేమ్ ఆన్సర్ చెప్పేసింది బ్యూటీ క్వీన్. మొత్తానికి మన లైగర్.. బాలీవుడ్ ముద్దుగుమ్మల డ్రీమ్ బాయ్ అవుతున్నాడంటూ విజయ్ అభిమానులు మురిసిపోతున్నారు.
మరిన్ని ఎంటర్‌టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..