AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navdeep: రానా నాయుడు సిరీస్ పై స్పందించిన నవదీప్.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌లో ఉందంటూ..

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిస్ నటించిన ఈ సినిమా వెబ్ సిరీస్ తెలుగు, హిందీలో స్ట్రీమింగ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ఈ వెబ్ సిరీస్ లో నటించారు వెంకటేష్, రానా.

Navdeep: రానా నాయుడు సిరీస్ పై స్పందించిన నవదీప్.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌లో ఉందంటూ..
Rana Naidu
Rajeev Rayala
|

Updated on: Apr 11, 2023 | 1:32 PM

Share

రీసెంట్ గా వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి అందరికి తెలిసిందే. దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిస్ నటించిన ఈ సినిమా వెబ్ సిరీస్ తెలుగు, హిందీలో స్ట్రీమింగ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ఈ వెబ్ సిరీస్ లో నటించారు వెంకటేష్, రానా. అయితే ఈ సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమాను తెలుగులో తొలగించారు. అయితే వెంకటేష్ ఇలా బోల్డ్ కంటెంట్ లో నటించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు. ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న వెంకీ.. ఈ సిరీస్ లో నటించడం పై కొందరు విమర్శలు చేశారు. అయితే బాలీవుడ్ లో ఈ సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ పై హీరో నవదీప్ స్పందించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవదీప్ మాట్లాడుతూ.. రామానాయుడు సిరీర్ ఇంతకు ముందు జనరేషన్ కు నచ్చక పోవచ్చు.. కానీ మా జనరేషన్ వాళ్లకు నచ్చుతోంది. ఈ వెబ్ సిరీస్ ను ఎంజాయ్ చేసేవాళ్లు కూడా కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమంది ఈ వెబ్ సిరీస్ పై విమర్శలు చేస్తున్నారు అన్నారు.

కానీ ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో నెంబర్ వన్ లో ఉంది. ఈ వెబ్ సిరీస్ చాలా మంది నచ్చలేదు అంటున్నారు. ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. దాని గురించి నేను మాట్లాడటం లేదు.. నా జనరేషన్ వాళ్లకు నచ్చింది. ముంబై నేపథ్యంలో జరిగిన కథ గనుక, అక్కడి కల్చర్ ఎలా ఉంటుందో తెలిస్తే ఈ వెబ్ సిరీస్ సరదాగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు నవదీప్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోహిత్‌నే తప్పిద్దామని స్కెచ్ వేశాడు.. కట్‌చేస్తే..
రోహిత్‌నే తప్పిద్దామని స్కెచ్ వేశాడు.. కట్‌చేస్తే..
కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే
కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే
డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు
డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు
ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!
ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ
భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు
భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు
లావణ్య త్రిపాఠి గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
లావణ్య త్రిపాఠి గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ కట్!
వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ కట్!
ఇంట్లో బల్లి కనిపించడం శుభమా, అశుభమా? జ్యోతిష్య శాస్త్రం చెప్పేది
ఇంట్లో బల్లి కనిపించడం శుభమా, అశుభమా? జ్యోతిష్య శాస్త్రం చెప్పేది
జెన్ జెడ్‌తో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక భేటీ!
జెన్ జెడ్‌తో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక భేటీ!