కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మోహన్ బాబు పుట్టిన రోజు (మార్చి17) నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన పెళ్లిలో మోహన్‌బాబు మౌనికను ఆశీర్వదిస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. ‘నడక నుంచి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా.. లవ్ యూ..’ అని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు మనోజ్. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు మోహన్ బాబుకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా మంచు మనోజ్ ఇటీవల నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో ఈ వేడుక జరిగింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. 2017లో ఒక్కడు మిగిలాడు అనే సినిమాలో హీరోగా నటించాడు మంచు మనోజ్. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు రావడంతో సినిమాలకు సైన్ చేయలేదు. ఆ మధ్యన అహం బ్రహ్మస్మీ పేరుతో సినిమాను ప్రకటించినా పట్టాలెక్కలేదు. అయితే ఈసారి మాత్రం వాట్ ద ఫిష్ అంటూ పక్కగా వస్తానంటున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ‘మనం మనం.. బరంపురం’ అనేది ఈ సినిమాకు క్యాప్షన్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పోస్టర్లు రిలీజయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..