Kartikeya Gummakonda: ఆర్ఎక్స్ 100 మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ

ఈ సినిమాతో కార్తికేయ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది పాయల్. రొమాంటిక్, ఇంటెన్స్ సీన్స్ లో పాయల్ రెచ్చిపోవడంతో ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి ఈ సినిమాకు.

Kartikeya Gummakonda: ఆర్ఎక్స్ 100 మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ
Rx100

Updated on: Aug 24, 2023 | 11:16 AM

చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అందుకోవడం కామనే.. కంటెంట్ బాగుంటే సినిమా సక్సెస్ ను ఎవరూ ఆపలేరు. ఇది నిజం చేస్తూ చాలా సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. అలాంటి సినిమాల్లో ఆర్ఎక్స్ 100 సినిమా ఒకటి. ఈ సినిమాతో కార్తికేయ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది పాయల్. రొమాంటిక్, ఇంటెన్స్ సీన్స్ లో పాయల్ రెచ్చిపోవడంతో ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి ఈ సినిమాకు.

ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత హీరో కార్తికేయకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడు కార్తికేయ. అలాగే పాయల్ కు కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆర్ఎక్స్ 100కు సీక్వెల్ వస్తుందా..? అని కొద్దిరోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఈ మూవీ సీక్వెల్ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు హీరో కార్తికేయ. కార్తికేయ ప్రస్తుతం ‘బెదురులంక 2012′ అనే సినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఎక్స్ 100 సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. ‘ఆర్‌ఎక్స్‌100’ సీక్వెల్‌ కాదు కానీ, అజయ్‌ భూపతితో మరో సినిమా చేసే ఆలోచన ఉందని తెలిపాడు. అజయ్ ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తో కలిసి మంగళవారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హారర్ జోనర్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాతగ్ కార్తికేయతో సినిమా ఉంటుందేమో చూడాలి.