Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan : తొలిసారి స్పందించిన దర్శన్.. వారికి ధన్యవాదాలు అంటూ..

తాజాగా దర్శన్‌ నయాకాంట్రవర్సీ కన్నడనాట కాకరేపుతోంది. త్వరలో రిలీజ్ కాబోయే క్రాంతి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కర్నాటకలోని హోస్పేటకు వెళ్ళిన హీరో దర్శన్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది.

Darshan : తొలిసారి స్పందించిన దర్శన్.. వారికి ధన్యవాదాలు అంటూ..
Darshan
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 22, 2022 | 8:14 PM

కన్నడ హీరో దర్శన్‌ పై దాడి దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రచ్చరంబోలాగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలతో సరికొత్తగా రోజుకో సంచలనానికి తెరతీసున్నాడు కన్నడ హీరో దర్శన్‌. తాజాగా దర్శన్‌ నయాకాంట్రవర్సీ కన్నడనాట కాకరేపుతోంది. త్వరలో రిలీజ్ కాబోయే క్రాంతి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కర్నాటకలోని హోస్పేటకు వెళ్ళిన హీరో దర్శన్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. దర్శన్‌ మూవీ క్రాంతి జనవరి 26న రిలీజ్‌ కాబోతోంది. క్రాంతి మూవీ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో కన్నడ హీరో దర్శన్‌పైకి చెప్పు విసిరాడో వ్యక్తి. ఇదే ఇష్యూ ఇప్పుడు కర్నాటకలో కాకరేపుతోంది. ప్రేక్షకజనంలో నుంచి ఓ వ్యక్తి చెప్పు విసరడంతో అది దర్శన్‌ భుజానికి తగిలింది. అంతటితో సినిమా అయిపోలేదు… ఆ తర్వాత అక్కడ ఉన్న దర్శన్ బ్యానర్లను కొందరు చింపివేశారు. దీంతో ఈవెంట్‌ గందరగోళంగా మారింది. దర్శన్‌పై దాడి ఘటన ఫ్యాన్స్‌లో కలకలం రేపింది.

కర్నాటక సినీ ఇండస్ట్రీలో నయా కాంట్రవర్సీ రచ్చరంబోలాగా మారింది. దర్శన్‌పై చెప్పు విసిరింది ఎవరో?ఎందుకు విసిరారో తెలియదు కానీ…కన్నడ ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న పునీత్‌ రాజ్‌కుమార్‌పై దర్శన్‌ వ్యాఖ్యలే ఈ దాడికి కారణమన్న విమర్శలు దర్శన్‌పై గుప్పుమంటున్నాయి. ఇదే ఇష్యూ ఇప్పుడు కన్నడ చలనచిత్ర రంగాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనతో మూవీ టీం అంతా షాక్‌కు గురయింది. దర్శన్ అభిమానులు కోపంతో ఊగిపోయారు. చెప్పువిసిరిన వ్యక్తిపై దాడికి యత్నించారు. అంతే… అక్కడంతా ఉద్రిక్తంగా మారింది. క్షణాల్లోనే పరిస్థితి అదుపుతప్పింది. ఫ్యాన్స్‌ పవరేంటో తెలిసిన కన్నడ పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఇవి కూడా చదవండి

లేటెస్ట్‌గా కన్నడ దివంగత హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి, కొత్త వివాదాల్లో ఇరుక్కున్నాడు. అదే వివాదం ఇప్పుడు దర్శన్‌పై చెప్పు దాడికి కారణమైంది. ఈ ఘటనపై పునీత్ రాజ్‌కుమార్‌ అన్న.. శివ రాజ్ కుమార్ స్పందించారు. ఈ చర్య తన హృదయాన్ని బాధించిందన్నారు. ఎవరూ మానవత్వాన్ని మరచి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని మనవి చేశారు. అభిమానంతో ప్రేమను చూపించు.. ద్వేషం అగౌరవం కాదంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా దర్శన్ స్పందిస్తూ.. ఆయన మాట్లాడుతూ… ఈ సమయంలో తనకు మద్దతు తెలుపుతూ అండగా నిలిచిన నటీనటులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో నాకన్నా నా సహనటీనటులే ఎక్కువగా బాధపడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఒక మనిషిని ఎప్పుడూ బలహీనపరచవని చెప్పుకొచ్చారు.

అలాగే మన కన్నడ గడ్డపై ఇలాంటి ఘటనలను ఎన్నో చూసాము. నాపై ప్రేమను చూపిస్తున్నటువంటి పలువురు నటీనటులకు అభిమానులకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దర్శన్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.