Chiyaan Vikram: విక్రమ్ అంత ఘోర ప్రమాదానికి గురయ్యారా..? 23 సర్జరీలు.. మూడేళ్ళ పాటు వీల్ చైర్‌లోనే..
ఆయన సినిమాల్లో కొన్ని తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. అపరిచితుడు సినిమా తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే విక్రమ్ నటించిన పలు సినిమాలు తెలుగులో మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ఇక విక్రమ్ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.
చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగిన విక్రమ్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఫెవరెట్ హీరో. ఆయన సినిమాల్లో కొన్ని తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. అపరిచితుడు సినిమా తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే విక్రమ్ నటించిన పలు సినిమాలు తెలుగులో మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ఇక విక్రమ్ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ లో నటించి అలరించారు విక్రమ్. ఆదిత్య కరికాలుడిగా నటించి మెప్పించారు.
ఇక ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 2 లో నటిస్తున్నాడు విక్రమ్. ఇదిలా ఉంటే విక్రమ్ కెరీర్ లో జరిగిన ప్రమాదం గురించి చాలా మందికి తెలియదు. దాంతో ఆయన మూడు నెలలు వీల్ చైర్ లోనే ఉండాలిసివచ్చిందట. ఇంతకు విక్రమ్ కు ఎం జరిగిందంటే..
వ్యక్తిగత జీవితంలో 12 ఏళ్ల వయసులో విక్రమ్ ప్రమాదానికి గురయ్యారు. విక్రమ్ బైక్ పై వెళ్తే ఘోరమైన యాక్సిండెంట్ జరిగిందంట..ఆయన కుడి కాలికి పెద్ద గాయం అయ్యింది. ఎంతకాలమైనా గాయం మనకపోవడంతో కాలును తొలగించాలని అన్నారట వైద్యులు. విక్రమ్ మాత్రం మనో ధైర్యాన్ని కోల్పోలేదట .. 23 సర్జరీలు జరిగాయట దాంతో వీల్ చైర్ లోనే మూడేళ్లు ఉన్నారట. అంత ప్రమాదం నుంచి మనోధైర్యంతో ఆ ప్రమాదం నుంచి బయట పడ్డారు విక్రమ్.