Cyclone Michaung: వర్షాల దెబ్బకు నీటమునిగిన సూపర్ స్టార్ ఇల్లు.. వైరల్ గా మారిన వీడియో
నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. తుపాను ధాటికి చెన్నైలోని పలు ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. చెన్నైతోపాటు పొరుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను ధాటికి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు కూడా దెబ్బతిన్నది. చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న రజనీకాంత్ ఇంట్లోకి నీరు చేరింది.

మైచాంగ్ తుఫాను తమిళనాడు, పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాల కారణంగా చెన్నైను వరదలు ముంచెత్తుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. తుపాను ధాటికి చెన్నైలోని పలు ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. చెన్నైతోపాటు పొరుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను ధాటికి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు కూడా దెబ్బతిన్నది. చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న రజనీకాంత్ ఇంట్లోకి నీరు చేరింది. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రజనీకాంత్ ఇంటి దగ్గర నీరు భారీగా ఉండటం మనం చూడొచ్చు. ఇంటి ముందున్న రోడ్డు పూర్తిగా జలమయమైంది. తుపాను సమయంలో రజనీకాంత్, ఆయన కుటుంబం చెన్నైలో లేరు. ఓ అభిమాని ఈ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ‘తలైవర్ 170’ షూటింగ్ పనుల కారణంగా సూపర్ స్టార్ చెన్నైలో లేరని తెలుస్తోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా చెన్నై వరదల్లో చిక్కుకున్నాడు. అతడిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో అమీర్ ఖాన్ ని చూసి అందరూ షాక్ అయ్యారు. వరదల కారణంగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా ఆమె భర్త కూడా ఇబ్బందుల్లో పడ్డారు.
మైచాంగ్ తుఫాను చెన్నైతో పాటు చుట్టుపక్కల జిల్లాలను చాలా ఇబ్బందులకు గురి చేసింది. తుపాను కారణంగా స్థానికులు నీరు, విద్యుత్తు సమస్యలతో సతమతమవుతున్నారు. తుపాను సమయంలో భారీ వర్షం కారణంగా వేలచ్చేరి, తాంబరం సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల వాసులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
Poes Garden near @rajinikanth house @Savukkumedia @SavukkuOfficial #ChennaiFloods2023 #ChennaiRains2023 #chennaicyclone #சென்னையை_மீட்ட_திமுக pic.twitter.com/tHiYTrFsW2
— Abdul Muthaleef (@MuthaleefAbdul) December 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
