Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 సీజన్‌‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే భార్యా భర్తలు వీరేనా..?

|

Sep 02, 2022 | 1:29 AM

తెలుగు టెలివిజన్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్. ఇక ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో ఇప్పుడు సీజన్ 6 లోకి అడుగు పెట్టింది.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 సీజన్‌‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే భార్యా భర్తలు వీరేనా..?
Bigg Boss 6 Telugu
Follow us on

తెలుగు టెలివిజన్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్(Bigg Boss 6 Telugu). ఇక ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో ఇప్పుడు సీజన్ 6 లోకి అడుగు పెట్టింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ గేమ్ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బిగ్ బాస్ ఎప్పుడు మొదలవుతుంది. ఎవరెవరు పాటిస్పెట్ చేయనున్నారన్నవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కూడా ఇక  బిగ్ బాస్ 6 ఈనెల సెప్టెంబర్ 4 నుంచి ప్రసారంకానుంది.

ఇక ఈ సీజన్ లో హౌస్ లోకి ఎవరు వెళ్లనున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురి పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ 6లోకి ఓ కపుల్ కూడా వెళ్లనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే బిగ్ బాస్ లో గతంలో భార్య భర్తలను హౌస్ లోకి పంపుతున్నారు. వరుణ్ సందేశ్- వితిక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా మరో జంట హౌస్ లోకి వెళ్లనున్నారని టాక్. అయితే ఆ జంట ఎవరోకాదు. సింగర్ హేమ చంద్ర, శ్రావణ భార్గవి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరు విడిపోతున్నట్టుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొననున్నారని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి