Lavanya tripathi: లావణ్య త్రిపాఠి ఫోన్‌ వాల్ పేపర్‌ ఏంటో తెలుసా.? నిశ్చితార్థం కాగానే మార్చేసిన చిన్నది.

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార లావణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగింటి కోడలిగా మారనుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ బ్యూటీ మెగా కోడలిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టనుంది. వరుణ్‌ తేజ్‌తో మరికొన్ని రోజుల్లోనే ఏడడగులు వేయనుందీ బ్యూటీ. ఇటీవల అంగరంగవైభవంగా జరిగిన నిశ్చితార్థ వేడుకకు...

Lavanya tripathi: లావణ్య త్రిపాఠి ఫోన్‌ వాల్ పేపర్‌ ఏంటో తెలుసా.? నిశ్చితార్థం కాగానే మార్చేసిన చిన్నది.
Lavanya Tripathi

Updated on: Jun 22, 2023 | 4:11 PM

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార లావణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగింటి కోడలిగా మారనుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ బ్యూటీ మెగా కోడలిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టనుంది. వరుణ్‌ తేజ్‌తో మరికొన్ని రోజుల్లోనే ఏడడగులు వేయనుందీ బ్యూటీ. ఇటీవల అంగరంగవైభవంగా జరిగిన నిశ్చితార్థ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

వరుణ్‌తేజ్‌తో ఇలా ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందో లేదో లావణ్యపై అందరి దృష్టి పడింది. ఇంతకీ ఈ జంట అసలు ఎప్పుడు సకనూయలో పడింది.? పెళ్లి వరకు ఎలా వచ్చింది లాంటి అంశాలపై అభిమానులు తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే లావణ్య సైతం సోషల్‌ మీడియాలో బిజీగా మారింది. అంతరకు అడపతాదడపా పోస్టులు చేసే ఈ బ్యూటీ ఎంగేజ్‌మెంట్ తర్వాత యాక్టివ్‌గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా తన ఫోన్‌ వాల్‌పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిందీ చిన్నది.

ఇవి కూడా చదవండి

ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌తో పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను గ్రిడ్ చేసి ఫొటోను డిజైన్ చేసింది. తాజాగా ఇదే ఫొటోను తన ఫోన్‌ వాల్‌ పేపర్‌గా సెట్ చేసుకుంది. ఇందులోనే వరుణ్‌ తేజ్‌ ఫొటో కూడా ఉంది. ఓ వెకేషన్‌లో వరుణ్‌తో కలిసి దిగిన ఫొటోని వాల్‌ పేపర్‌లో సెట్ చేసుకుంది లావణ్య. ఈ ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఈ బ్యూటీ.. ‘మై లవ్స్‌.. డ్రీమ్‌ బిగ్గర్‌’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..