Harsha Chemudu: అన్నా.. నీ రేంజ్ మారిపోయింది! కమెడియన్ హర్ష ఇంట్లో ఎన్ని కార్లు, బైక్స్ ఉన్నాయో చూశారా? వీడియో

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ఆరంభించాడు హర్ష. 'వైవా' అనే లఘు చిత్రంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. యూట్యూబర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇదే క్రమంలో సినిమాల్లోనూ అడుగు పెట్టాడు. ఓ వైపు కమెడియన్ రోల్స్ చేస్తూనే హీరోగానూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

Harsha Chemudu: అన్నా.. నీ రేంజ్ మారిపోయింది! కమెడియన్ హర్ష ఇంట్లో ఎన్ని కార్లు, బైక్స్ ఉన్నాయో చూశారా? వీడియో
Harsha Chemudu

Updated on: Oct 03, 2025 | 9:29 PM

మూడు రోజుల పాటు జరుపుకొనే దసరా పండగలో ఆయుధ పూజ ప్రధానమైనది. ఈ పర్వదినాన చాల మంది తమ ఇంట్లోని వాహనాలను శుభ్రంగా కడిగి పూలతో అలంకరించి పూజలు చేస్తారు. దిష్టి కూడా తీస్తారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇలా వాహన పూజ చేస్తుంటారు. అలా టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష ఇంట్లో కూడా దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. భార్య అక్షరతో కలిసి ఈ పర్వదినాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు హర్ష. ఈ సందర్భంగా తన కార్లు, బైకులన్నింటినీ శుభ్రంగా కడిగి దండవేసి ఇంటి ముందు రెడీగా పెట్టాడు. భార్యతో కలిసి వాహనపూజ చేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. దీనికి ఒక ఎమోషనల్ నోట్ కూడా జోడించాడు. ‘మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు’. ఆయుధపూజ చేయడానికి ఏడాదంతా ఎదురుచూస్తాం. ఇవన్నీ చేయటానికి ఎంతో కష్టపడతాం. ఆటోమొబైల్స్‌ మీద నాకున్న ఇష్టాన్ని అర్థం చేసుకుని, నేను ఎన్ని వాహనాలు కొంటున్నా అడ్డు చెప్పని ఫ్యామిలీకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో వాళ్ల త్యాగాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఎప్పుడూ వాటి గురించి మాట్లాడరు. ఎందుకంటే నేను బాధపడకూడదన్నదే వాళ్ల కోరిక. అలాగే ఇది నా చిన్ననాటి కల’

‘ నాకు చిన్నప్పటి నుంచే కార్లు, బైక్ లపై మోజు. అందుకే వాటి ఫొటోలతో నా గదినంతా నింపేసేవాడిని. ఎక్కడ చూసినా వాటి స్టిక్కర్లే ఉండేవి. నా పాకెట్‌మనీలో కొంత డబ్బు దాచుకుని దానితో ఆటోమొబైల్స్‌ మ్యాగజైన్లు కొనుక్కునేవాడిని. కొద్ది రోజుల్లోనే అది పూర్తిగా చదివేసి.. మళ్లీ తర్వాతి నెల మ్యాగజైన్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవాడిని. అలా నా చిన్నప్పుడు నేను ఇష్టపడ్డ వాహనాలను ఇప్పుడు సేకరిస్తున్నాను. ఒక్కొక్కటిగా అన్నీ కొనుక్కుంటూ పోతున్నాను. అందుకే నా దగ్గర ఇన్ని కార్లు, బైక్స్‌ ఉన్నాయి. మీ అందరి ప్రేమాభిమానాలు లేకుంటే ఇవన్నీ కొనగలిగేవాడినే కాదు. నన్ను మీలో ఒకడిగా చూసుకుంటున్నందుకు చాలా చాలా థాంక్స్‌. నా ప్రతి విజయంలో మీ భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీ సపోర్టే కారణం. మీవల్లే నా కలల్ని సాకారం చేసుకోగలుగుతున్నాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు హర్ష.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

హర్ష ఇంట్లో ప్రస్తుతం 4 కార్లు, 10 బైక్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ టాలీవుడ్ కమెడియన్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది గేమ్‌ ఛేంజర్‌, తండేల్‌, సారంగపాణి జాతకం, జూనియర్‌, బకాసుర రెస్టారెంట్‌ చిత్రాల్లో మెరిశాడీ టాలీవుడ్ కమెడియన్.

భార్య అక్షరతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.