Gopichand : పడిలేచిన కెరటం తండ్రికి తనయుడు మ్యాచో స్టార్ గోపీచంద్‌ పుట్టిన రోజు నేడు..

|

Jun 12, 2021 | 5:19 PM

Gopichand: గోపీ చంద్ తండ్రి చేసిన సినిమాలను చూస్తూ పెరిగాడు.. విదేశాల్లో చదువుకున్నాడు.. తిరిగి మనదేశం వచ్చి.. సినిమాలవైపు అడుగు వేశాడు. హీరోగా టాలీవుడ్ లో తొలివలపు..

Gopichand : పడిలేచిన కెరటం తండ్రికి తనయుడు మ్యాచో స్టార్ గోపీచంద్‌ పుట్టిన రోజు నేడు..
Gopichand
Follow us on

Gopichand: గోపీ చంద్ తండ్రి చేసిన సినిమాలను చూస్తూ పెరిగాడు.. విదేశాల్లో చదువుకున్నాడు.. తిరిగి మనదేశం వచ్చి.. సినిమాలవైపు అడుగు వేశాడు. హీరోగా టాలీవుడ్ లో తొలివలపు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు మొదటి సినిమా సక్సెస్ ఇవ్వలేదు. తర్వాత విలన్ గా మారాడు.. నిజం సినిమాతో తనలోని నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. నిజం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా నటించి హీరోలతో సమానంగా పేరు తెచ్చుకున్నాడు. అలా విలన్ గా వరస అవకాశాలను అందుకుంటునే మళ్ళీ హీరోగా చేసే అవకాశం దక్కించుకున్నాడు గోపీ చంద్. యజ్ఞం, రణం, ఆంధ్రుడు, లక్ష్యం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకోవడమే కాదు.. టాలీవుడ్ యాంగ్రీమేన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఓ పక్కా కమర్షియల్ హిట్ కోసం సీటీమార్ అంటోన్న గోపీచంద్ పుట్టిన రోజు నేడు.

టాలీవుడ్ లో ఒకప్పుడు గొప్ప దర్శకుడు టి. కృష్ణ. ఆ డైరెక్టర్ తనయుడు గోపీచంద్. అయితే గోపీ చంద్ చిన్నతనంలోనే తండ్రి కృష్ణ మరణించారు. రష్యాలో చదువుకున్న గోపీచంద్ తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమా తొలివలపు ఫ్లాప్. అటుపై విలన్ గా ఆకట్టుకున్నాడు. విలన్ పాత్రలో ఉత్తమ నటుడుగా అవార్డులూ అందకున్నాడు. కానీ అతని మనసులో హీరో కావాలని బలంగా ఉంది. ఆ సమయంలో టి కృష్ణ స్నేహితుడు పోకూరి బాబురావు .. గోపీచంద్ కు అండగా నిలబడ్డాడు. ఆయన బ్యానర్ లోనే గోపీని హీరోగా మళ్ళీ యజ్ఞం సినిమాను నిర్మించాడు. యజ్ఞం సినిమా తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నాడు. మళ్ళీ హీరోగా కెరీర్ గాడిలో పడింది. ప్రస్తుతం గోపీచంద్‌ ‘సిటీమార్‌’, ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

మ్యాచో స్టార్ గోపీచంద్‌.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో…తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ వివాహం 2013లో ప్రముఖ హీరో శ్రీకాంత్ కు మేనకోడలు రేష్మతో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు. తన భార్య కోరిక ప్రకారం వారికి ‘విరాట్ కృష్ణ’, ‘వియాన్’ అనే పేర్లు పెట్టామని ఓ ఇంటర్వ్యూలో గోపిచంద్‌ చెప్పాడు

Also Read: అనేక రహస్యాలు నెలవు ఈ శివాలయం తల్లికోసం పాండవులు ఒక్కరాత్రిలో నిర్మించినట్లు పురాణాల కథనం