Hanuman Movie: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను క‌లిసిన ‘హ‌నుమాన్’ మూవీ టీమ్‌.. కారణమిదే

|

Jan 24, 2024 | 8:39 PM

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్‌ ఇప్పటికే రూ. 200 కోట్లను రాబట్టింది. సంక్రాంతి విజేతగా నిలిచింది. కేవలం సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ హనుమాన్‌ సినిమాకు ఆడియెన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హ‌నుమాన్ టీమ్ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను క‌లుసుకుంది.

Hanuman Movie: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను క‌లిసిన ‘హ‌నుమాన్’ మూవీ టీమ్‌.. కారణమిదే
Hanuman Movie Team
Follow us on

‘హనుమాన్‌’ దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ మైథలాజికల్‌ మూవీ కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్‌ ఇప్పటికే రూ. 200 కోట్లను రాబట్టింది. సంక్రాంతి విజేతగా నిలిచింది. కేవలం సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ హనుమాన్‌ సినిమాకు ఆడియెన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హ‌నుమాన్ టీమ్ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను క‌లుసుకుంది. హీరో తేజ సజ్జా, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో పాటు మరికొందరు మర్యాద పూర్వకంగా యోగీని కలిశారు. ‘హనుమాన్‌’ విశేషాలను అలాగే దేశవ్యాప్తంగా తమ సినిమాకు వస్తోన్న ఆదరణను ముఖ్యమంత్రికి వివరించారు. ఇక హీరో తేజ సజ్జా కూడా యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అవడంపై స్పందించాడు. ‘యోగిజీని కలవడం ఒక పెద్ద గౌరవంగా అనిపిస్తుందన్నాడు. ప్ర‌స్తుతం హనుమాన్‌, యోగీల భేటీకి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి

హనుమాన్‌ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మరో కీలక పాత్రలో మెరిసింది. వినయ్‌ రాయ్‌, సముద్ర ఖని, జబర్దస్త్‌ శీను తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.  కాగా హనుమాన సినిమాకు అమ్ముడైన ప్రతి టిక్కెట్టుకు ఐదు రూపాయలను రామమందిరానికి విరాళంగా అందజేస్తామని బృందం ప్రకటించింది. 53.28 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దీని ద్వారా చిత్ర బృందం 2.66 కోట్ల రూపాయలను రామమందిర నిర్మాణానికి విరాళంగా అందజేసింది. హనుమాన్ టీమ్ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక హనుమాన్ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పటికే జై హనుమాన్‌ ను కూడా ప్రకటించారు డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ .ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులను కూడా పూర్తి చేశారు. జై హనుమాన్ చిత్రం 2025లో రిలీజ్ కాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి