మాస్ మాహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ‘ఈగల్’. ఇందులో ఆయన ఇదివరకు ఎప్పుడూ కనిపించని సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ మూవీ సంక్రాంతి పండక్కి విడుదల కావాల్సి ఉంది. కానీ థియేటర్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈగల్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక శుక్రవారం (జనవరి 26న) రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీలోని ‘ఈగల్స్ ఆన్ హిజ్ వే.. ఇట్స్ టైమ్ టు డై..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతం అందించారు.
ఇదిలా ఉంటే.. ఈమూవీ ప్రమోషన్లలో భాగంగా ఈగల్ కోసం హనుమాన్ బరిలోకి దిగాడు. ఈ సందర్భంగా రవితేజతో యంగ్ హీరో తేజ సజ్జా వారిద్దరి సినిమాల గురించి సరదాగా ముచ్చటించారు. ఈగల్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను అడిగి తెలుసుకున్నారు తేజ. అంతకు ముందు హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు తేజను అభినందించారు రవితేజ. ప్రస్తుతం ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
Here’s the Super Fun Conversation between Mass Maharaj @RaviTeja_offl & Our Super Hero @tejasajja123 🤩#EAGLE 🦅 X #HanuMan 💥
Full Interview Youtube Link – https://t.co/xRypQVtFq5@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @RajaS_official… pic.twitter.com/UNOw3D5j3m
— People Media Factory (@peoplemediafcy) January 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.