గుప్పెడంత మ‌న‌సు నటి అసభ్యకర వీడియోలు వైరల్.. మ‌నోవేద‌న‌కు గురయ్యానంటున్న జ్యోతి రాయ్

|

May 09, 2024 | 12:37 PM

తాజాగా తెలుగు సీరియల్ యాక్ట్రస్ అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ సీరియల్ నటి జ్యోతిరాయ్‌ మార్ఫింగ్ వీడియో, మార్ఫింగ్ ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జ్యోతి రాయ్‌కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు నటి జ్యోతి రాయ్ దీనిపై ఘాటుగా స్పందించారు. 

గుప్పెడంత మ‌న‌సు నటి అసభ్యకర వీడియోలు వైరల్.. మ‌నోవేద‌న‌కు గురయ్యానంటున్న జ్యోతి రాయ్
Jyothi Rai
Follow us on

సైబర్ నేరగాళ్ల అరాచకం ఈ మధ్య ఎక్కువవుతుంది. సెలబ్రెటీలు ఇబ్బంది పెడుతూ కొందరు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలను, వీడియోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా తెలుగు సీరియల్ యాక్ట్రస్ అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ సీరియల్ నటి జ్యోతిరాయ్‌ మార్ఫింగ్ వీడియో, మార్ఫింగ్ ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జ్యోతి రాయ్‌కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు నటి జ్యోతి రాయ్ దీనిపై ఘాటుగా స్పందించారు. ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. అసంతృప్తిని వ్యక్తం చేసింది.

కన్నడ నటి జ్యోతి రాయ్ తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. అలాగే టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్ లో డీసెంట్ రోల్స్ చేస్తున్న జ్యోతి.. సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన గ్లామరస్ ఫోటోలను తరచుగా పంచుకుంటుంది. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన కొన్ని అసభ్యకర వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. దీనిపై మాట్లాడిన జ్యోతి రాయ్.. తన ఫేక్ వీడియోలు, చిత్రాలను ప్రచారం చేస్తూ తన పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ట్విట్టర్‌లోని ఎడిట్ బై అభి అనే ఖాతాలో జ్యోతి రాయ్‌కి సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు అప్‌లోడ్ చేయబడ్డాయి. అలాగే వారి యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేస్తే పూర్తి వీడియో విడుదల చేస్తామని.. ఆ ఖాతా నుండి మెసేజ్ కూడా షేర్ చేశారు. అయితే ఆ తర్వాత ఆ వీడియో, ఫొటోలను తొలగించారు. అయితే అప్పటికి చాలా మంది వీడియోలు, చిత్రాలను డౌన్‌లోడ్ చేసి వైరల్ చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన నటి జ్యోతిరాయ్.. ‘నిరంతరంగా మెసేజ్‌లు పంపుతూ మెంటల్‌ టార్చర్‌ చేస్తున్నారు. దయచేసి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. నా పరువు, నా కుటుంబం పరువు తీస్తున్నారు. మీరు వెంటనే చర్య తీసుకోకపోతే, ఇది కొనసాగే అవకాశం ఉంది. ఇది కోలుకోలేని సమస్యను సృష్టించే అవకాశం ఉంది అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.