ఆస్కార్ నామినేషన్‌లో ‘గల్లీ బాయ్’..సౌత్ జనం గరంగరం!

92వ ఆస్కార్ వేడుకల హంగామా మొదలైంది. సినిమాలలో కెల్లా అత్యంత గొప్పదైన, ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డును సొంతం చేసుకోవాలని ప్రతి టెక్నీషియన్, నటీనటులు కలలు కంటూ ఉంటారు. ఎట్‌లీస్ట్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం కూడా అదృష్టంగానే భావిస్తారు. ఇప్పటివరకు ఇండియా నుంచి భాను అతయా, రెసుల్ పోకుట్టి, ఏఆర్ రెహమాన్ వివిధ కేటగిరిల్లో ఆస్కార్‌ అవార్డును ముద్దాడారు. తాజాగా బాలీవుడ్ నటులు రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘గల్లీ బాయ్’ ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్‌కి […]

ఆస్కార్ నామినేషన్‌లో ‘గల్లీ బాయ్’..సౌత్ జనం గరంగరం!
Follow us

|

Updated on: Sep 23, 2019 | 5:57 PM

92వ ఆస్కార్ వేడుకల హంగామా మొదలైంది. సినిమాలలో కెల్లా అత్యంత గొప్పదైన, ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డును సొంతం చేసుకోవాలని ప్రతి టెక్నీషియన్, నటీనటులు కలలు కంటూ ఉంటారు. ఎట్‌లీస్ట్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం కూడా అదృష్టంగానే భావిస్తారు. ఇప్పటివరకు ఇండియా నుంచి భాను అతయా, రెసుల్ పోకుట్టి, ఏఆర్ రెహమాన్ వివిధ కేటగిరిల్లో ఆస్కార్‌ అవార్డును ముద్దాడారు.

తాజాగా బాలీవుడ్ నటులు రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘గల్లీ బాయ్’ ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్‌కి అఫీషియల్ ఎంట్రీగా నామినేట్ అయ్యింది. జోయా అఖ్తర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.  ముంబయిలోని ఓ పేద కుటుంబానికి చెందిన అప్ కమింగ్ ర్యాపర్ తనకున్న అడ్డంకులను ఎదురీది  కలలను ఎలా సాకారం చేసుకున్నాడు? అన్నది ఈ సినిమా కథాంశం. అయితే ఈ సినిమా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం క్యాటగిరీలో నామినేట్ అయింది. దీనిపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  ‘గల్లీ బాయ్’ సినిమాను హాలీవుడ్ సినిమాల ప్రేరణగా తీసుకోని తెరకెక్కించారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఆస్కార్స్‌లో రీమేక్ సినిమాలకు ప్రవేశం ఉండదు. కమర్షియల్, మాస్ సినిమాల కంటే..హృద్యమైన కంటెంట్, నిజ జీవిత ప్రేరణలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే ‘గల్లీ బాయ్’ నామినేట్ అవ్వడంతో రచ్చ నడుస్తోంది. 92 ఆస్కార్ వేడుకల కోసం మొత్తం భారతదేశంలోని అన్ని భాషల్లో ఉన్న మంచి సినిమాలను సెలక్ట్ చెయ్యగా.. వాటి నుంచి 27 చిత్రాలను ఉత్తమమైనవిగా గుర్తించారు. వీటిలో నుంచి ఒక్క గల్లీ బాయ్ మాత్రమే ఆస్కార్ నామినేషన్‌కు నోచుకుంది.

అసలు కొన్ని సినిమాల నుంచి ప్రేరణ పొందిన చిత్రాన్ని ఎలా నామినేట్ చేస్తారన్న చర్చ ఇప్పుడు విసృతంగా జరుగుతోంది.  గల్లీ బాయ్ కంటే తమిళ్ నుంచి పిక్ చేసుకున్న‘సూపర్ డీలక్స్’  ‘వడచెన్నై’ సినిమాలు కంటెంట్ పరంగా గొప్పవైనవని..దక్షణాదిలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఆస్కార్ అకాడమీపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ విమర్శలకు బలం చేకూర్చే మరో విషయం ఏంటంటే.. ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) రేటింగ్ ప్రకారం గల్లీ బాయ్ కంటే ‘వడచెన్నై’ సినిమాకు ఎక్కువ రేటింగ్ వచ్చింది. ఇక ‘సూపర్ డీలక్స్’ కూడా కొన్ని జీవితాల సమాహారంగా ఉంటూ మనసును హత్తుకుంటుంది. నార్త్ వాళ్లు లాబీయింగ్ చేసుకుంటూ..దక్షిణాదిపై వివక్ష చూపిస్తున్నారంటూ తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగులో ఈ ఏడాది చేనేత కార్మికుల బ్రతుకులకు అర్థం పట్టే  ‘మల్లేశం’ లాంటి గొప్ప సినిమాలు వచ్చాయి. భారతదేశ ప్రాముఖ్యతలు, వివిధ జాతుల భిన్న సంస్కృతులు, స్ఫూర్తినిచ్చే వ్యక్తుల విజయగాథలు చాలా గొప్పగానే భారతదేశంలో రూపొందుతున్నాయి. కానీ ఆస్కార్ రేంజ్‌కి వెళ్లడానికి మధ్యలోనే వాటికి మార్గాలు మూసుకుపోతున్నాయి. ఈ విషయంపై ఆస్కార్ అవార్డులు వచ్చిన ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంటుంది. ‘ఆస్కార్’ అనేది భారతదేశానికి దక్కే గౌరవం. ఈ విషయం గుర్తుంచుకుంటే మనం కూడా చరిత్రలో చిరస్మరణీయమైన విజయాలు అందుకునే అవకాశం ఉంటుంది.

మొత్తం 27 సినిమాల్లో దక్షణాది నుంచి పరిశీలించి వడపోత పోసిన సినిమాలు:

తెలుగు: డియర్ కామ్రేడ్

తమిళ్:   వడ చెన్నై, సూపర్ డీలక్స్, ఒత్తా సెరుపు సైజ్ 7

కన్నడ: కురుక్షేత్ర