Tollywood: ఈ కుందనపు బొమ్మను గుర్తు పట్టారా? ఓ టాలీవుడ్ దిగ్గజ నటుడి కుమార్తె.. ఓ ట్యాలెంటెడ్ హీరో భార్య కూడా

ఈ కుందనపు బొమ్మ ఓ టాలీవుడ్ దిగ్గజ నటుడి కుమార్తె. స్టార్ హీరో సోదరి.. అలాగే ఓ వర్సటైల్ యాక్టర్ సతీమణి. టాలీవుడ్ లో వీరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ముఖ్యంగా ఆమె సోదరుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు. అతనంత కాకపోయినా భర్త కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Tollywood: ఈ కుందనపు బొమ్మను గుర్తు పట్టారా? ఓ టాలీవుడ్ దిగ్గజ నటుడి కుమార్తె.. ఓ ట్యాలెంటెడ్ హీరో భార్య కూడా
Tollywood Celebrity

Updated on: May 29, 2024 | 5:12 PM

పై ఫొటోలో ఉన్న కుందనపు బొమ్మను గుర్తు పట్టారా?ఈమె టాలీవుడ్ కు చెందిన ఓ ఫేమస్ సెలబ్రిటీ. అయితే హీరోయిన్ మాత్రం కాదు. నిర్మాత, దర్శకురాలు కూడా కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 ఫ్రేమ్స్ తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ కుందనపు బొమ్మ ఓ టాలీవుడ్ దిగ్గజ నటుడి కుమార్తె. స్టార్ హీరో సోదరి.. అలాగే ఓ వర్సటైల్ యాక్టర్ సతీమణి. టాలీవుడ్ లో వీరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ముఖ్యంగా ఆమె సోదరుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు. అతనంత కాకపోయినా భర్త కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ వెర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడైనా ఆమె ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేం చెబుతాం లెండి. ఆమె ఎవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని ఘట్టమనేని. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు సతీమణి.

సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి మే 29, 2006లో గ్రాండ్ గా జరిగింది. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. బుధవారం (మే 29) సుధీర్ బాబు, ప్రియ దర్శినిల వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా తన సతీమణికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడీ ట్యాలెంటెడ్ హీరో. తన భార్య ప్రియదర్శిని పెళ్లిచూపుల ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుని మ్యారేజ్ యానివర్సరీ విషెస్ తెలిపాడు. ‘ నాతో ఉన్నప్పటి తన మొదటి ఫోటో.. అంతేకాదు పెళ్లిచూపుల ఫొటో’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చాడు సుధీర్. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు సుధీర్ బాబు, ప్రియదర్శిని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

హీరో సుధీర్ బాబు పోస్ట్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. సుధీర్‌ బాబు హీరోగా నటించిన చిత్రం హరోం హర త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. జ్ఞానసాగర్‌ ద్వారక ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని మే 31న రిలీజ్‌ చేయాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో వచ్చేనెల జూన్‌ 14న కు వాయిదా వేశారు.

హరోం హర సినిమాలో సుధీర్ బాబు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.