Tollywood: ఇంత అందాన్ని ఎవరు మాత్రం కాదంటారు.. ఇట్టే ప్రేమలో పడతారు.. ఈ తెలుగు పిల్లను గుర్తుపట్టారా..?

ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. యంగ్ హీరోయిన్.. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు ఆడియన్స్ మదిలో చోటు సంపాదించుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: ఇంత అందాన్ని ఎవరు మాత్రం కాదంటారు.. ఇట్టే ప్రేమలో పడతారు.. ఈ తెలుగు పిల్లను గుర్తుపట్టారా..?
Actress

Updated on: Mar 15, 2023 | 12:47 PM

సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోహీరోయిన్స్ వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఇక స్టార్స్ సైతం తమ ఫాలోవర్లతో తమ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలయ్యాయి. తాజాగా కొందరు స్టార్ హీరోయిన్స్ లేటేస్ట్ క్రేజీ పిక్చర్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. అందులో మన టాలీవుడ్ హీరోయిన్ ఫోటో కూడా ఒకటి. పైన ఫోటోనూ చూశారు కదా. ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. యంగ్ హీరోయిన్.. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు ఆడియన్స్ మదిలో చోటు సంపాదించుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

ఆ వయ్యారి ఎవరంటే.. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. 1992 నవంబర్ 12న ఏపీలోని అనంతపురంలో జన్మించింది. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రియాంక.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2017లో కలవరం ఆయే సినిమాతో తెలుగు తెరపై సందడి చేసింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ప్రియాంకకు అంతగా గుర్తింపు రాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రంలో కథానాయికగా నటించింది.ఈ మూవీ తర్వాత గమనం చిత్రంలో కనిపించగా.. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ప్రియాంక ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయినా ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. చివరిసారిగా ఆమె తిమ్మరుసు చిత్రంలో కనిపించింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ప్రియాంక ఫుల్ యాక్టివ్‎గా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.