AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఈ ఫొటోలోని ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్‌ యాంకర్‌.. బుల్లితెరపై ఈ బ్యూటీదే హవా.. ఎవరో గుర్తుపట్టారా మరి ?

ఇందులో చారడేసి కళ్లు, బూరె బుగ్గలతో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ యాంకర్. తన అందం, అభినయంతో బుల్లితెరపై హవా కొనసాగిస్తోందీ అమ్మడు. అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అభిమానులను అలరిస్తోంది. మరి ఇంతకీ ఈ క్యూట్‌ బేబీ ఎవరో గుర్తుపట్టారా?

Actress: ఈ ఫొటోలోని ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్‌ యాంకర్‌.. బుల్లితెరపై ఈ బ్యూటీదే హవా.. ఎవరో గుర్తుపట్టారా మరి ?
Actress
Basha Shek
|

Updated on: Apr 27, 2023 | 8:37 AM

Share

‘జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా అవి ఎప్పటికీ మనతోనే మనలోనే ఉండిపోతాయి’ అని ఓ సినిమా హీరో చెప్పినట్లు గతం తాలూకు అనుభవాలు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. ముఖ్యంగా చిన్ననాటి జ్ఞాపకాలు మనకు అమితమైన మధురానుభూతిని కలగజేస్తాయి. అందుకే సోషల్‌ మీడియాలో త్రో బ్యాక్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ప్రధానంగా సినిమా సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు.. ఇలా సందర్భమేదైనా తమ త్రో బ్యాక్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. నెటిజన్లు కూడా తమ అభిమాన నటీ నటుల అరుదైన ఫొటోలు, చైల్డ్‌హుడ్‌ పిక్స్‌ చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అలా ప్రస్తుతం ఒక ఫొటో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో చారడేసి కళ్లు, బూరె బుగ్గలతో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ యాంకర్. తన అందం, అభినయంతో బుల్లితెరపై హవా కొనసాగిస్తోందీ అమ్మడు. అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అభిమానులను అలరిస్తోంది. మరి ఇంతకీ ఈ క్యూట్‌ బేబీ ఎవరో గుర్తుపట్టారా? ఐడెంటిఫై చేయకపోయినా నో ప్రాబ్లమ్‌.. సమాధానం మేమే చెబుతాం. ఈ చిన్నారి మరెవరో కాదు స్టార్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్.

అటు బుల్లితెర, ఇటు వెండితెరపై హవా కొనసాగిస్తోన్న రష్మీ గౌతమ్ పుట్టిన రోజు నేడు (ఏప్రిల్‌ 27). అందుకే ఆమె అరుదైన, త్రో బ్యాక్‌ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో కూడా ఆ కోవకు చెందినదే. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్‌తో పాటు మరికొన్ని టీవీ షోల్లోనూ కనిపిస్తోన్న రష్మీ ఇటీవల ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌ చేసింది. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనుందీ అందాల తార. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్‌లో రష్మీ ఓ కీ రోల్‌ పోషిస్తోంది. మరి ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటోన్న ఈ అమ్మడికి మనమూ బర్త్‌ డే విషెస్‌ చెబుదాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..