Tollywood: ఇంద్రధనుస్సు సైతం ఈ ముద్దుగుమ్మను చూసి అసూయ పడేలా ఉందే.. ఈ ఫిట్‏నెస్ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి…

తాజాగా తాను వర్కవుట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజాగా మరో హీరోయిన్ వర్కవుట్స్ చేస్తున్న ఫోటోస్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. ఆ ముద్దుగుమ్మ్ను చూసి ఇంద్రధనుస్సు సైతం అసూయ పడేలా ఉంది కదూ.. అయితే ఈ ఫిట్‏నెస్ క్యూటీ ఎవరో మీరు గుర్తుపట్టండి.

Tollywood: ఇంద్రధనుస్సు సైతం ఈ ముద్దుగుమ్మను చూసి అసూయ పడేలా ఉందే.. ఈ ఫిట్‏నెస్ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి...
Actress

Updated on: Jan 26, 2023 | 5:54 PM

ఫిట్‏నెస్ విషయంలో హీరోయిన్స్ ఎంత కేర్ తీసుకుంటారో చెప్పక్కర్లేదు. యోగా.. జిమ్.. భారీ వర్కవుట్స్ చేస్తూ తమ శరీరాకృతిని.. అందాన్ని కాపాడుకుంటుంటారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వర్కవుట్స్ చేయడంలో ఒక్కో హీరోయిన్ ఒక్కో స్టైల్ మెయింటెన్ చేస్తుంటారు. కొందరు ఎంతో సులువైనవి ఎంచుకుంటే..మరికొందరు కేవలం యోగకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కొన్ని రోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాజాగా తాను వర్కవుట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజాగా మరో హీరోయిన్ వర్కవుట్స్ చేస్తున్న ఫోటోస్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. ఆ ముద్దుగుమ్మను చూసి ఇంద్రధనుస్సు సైతం అసూయ పడేలా ఉంది కదూ.. అయితే ఈ ఫిట్‏నెస్ క్యూటీ ఎవరో మీరు గుర్తుపట్టండి.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయంతో కుర్రాళ్ల మదిని దొచుకుంది. ఈ వయ్యారికి ఫాలోవర్స్ కూడా ఎక్కువే. గుర్తుపట్టండి. ఈ వర్కవుట్స్ తో ఇరగదీస్తోన్న ఈ చిన్నది మరెవరో కదూ.. కన్నడ కుట్టి ఆషికా రంగనాథ్. అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కన్నడ సోయగం అషికా రంగనాథ్. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు దాదాపు 16 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఆషికా రంగనాథ్.. 1996 ఆగస్ట్ 5న కర్ణాటకలో జన్మించింది. 2016న క్రేజీ బాయ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రాంబో 2 చిత్రంలో కథానాయికగా నటించింది. ప్రస్తుతం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తోన్న అమిగోస్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమా తర్వాత ఆషికాకు తెలుగులో భారీగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.