అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. 90’sలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆ తార.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. కథానాయికగా అలరించిన ఆమె.. ఇప్పుడు తల్లి పాత్రలతో మెప్పిస్తోంది. ఎవరో గుర్తుపట్టండి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి.. బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కథానాయికగానే కాదు.. ప్రతినాయికగానూ కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎవరో గుర్తుపట్టండి.
అమాయకంగా కనిపిస్తోన్న ఆ అమ్మాయి.. హీరోయిన్ రమ్యకృష్ణ. 1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించిన ఆమె.. 1985లో వచ్చిన భలే మిత్రులు సినిమాతో తెరంగేట్రం చేసింది. 1990 నుంచి 2000 వరకు ఎన్నో టాప్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించింది. అల్లరి మొగడు, అల్లరి ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, అల్లుడు గారు, ఆవిడే శ్యామల, ఆహ్వానం, చంద్రలేఖ, అన్నమయ్య వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది.
హీరోయిన్గా వరుస అవకాశాలతో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో విలన్ పాత్రలో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్, సౌందర్య కలిసి నటించిన నరసింహా చిత్రంలో ప్రతినాయికగా కనిపించింది. ఇందులో రజినీతో పోటీపడి మరీ నీలాంబరి పాత్రను రక్తి కట్టించింది. డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమ పెళ్లి చేసుకున్నారు రమ్యకృష్ణ. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తండ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.