Tollywood: ఈ ఫోటోలోని ఓ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉంది.. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?..

మీకోసం మరో క్రేజీ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ తీసుకువచ్చాం. పైన ఫోటోను చూశారా కదా.. అందులో మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తనకంటూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ఈ చిన్నది..

Tollywood: ఈ ఫోటోలోని ఓ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉంది.. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress

Edited By:

Updated on: May 18, 2023 | 3:40 PM

త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్.. ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీస్ చిన్ననాటి పిక్స్ చూసేందుకు.. వారిని గుర్తుపట్టేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే మీకోసం మరో క్రేజీ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ తీసుకువచ్చాం. పైన ఫోటోను చూశారా కదా.. అందులో మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తనకంటూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ఈ చిన్నది.. ఇప్పుడు హీరోయిన్ గా కాకుండా.. ప్రొడ్యూసర్ గా రాణిస్తుంది. ఎవరో గుర్తుపట్టండి. తనే హీరోయిన్ ఛార్మీ (ఎడమ వైపు ఉన్న చిన్నారి). ఈరోజు (మే 17న) ఛార్మీ పుట్టినరోజు.

సినీపరిశ్రమలో ఛార్మీ కౌర్ అంటే యూత్ లో యమ క్రేజ్ ఉంది. కథానాయికగా అగ్రనటులందరి సరసన నటించింది. 2002లో నీతోడు కావాలి సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ పంజాబీ బ్యూటీ.. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

1987 మే 17న హైదరాబాద్ కు చెందిన పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. ఛార్మీ 14 ఏళ్ల వయసులో ‘నీ తోడు కావాలి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాతో హీరోయిన్‌గా బ్రేక్ వచ్చింది. ఈ సినిమా ఫ్లాపైనా.. కథానాయికగా ఛార్మికి మాత్రం ఈ సినిమా బాగానే కలిసొచ్చింది. తెలుగులో చిరంజీవి తప్ప మిగిలిన సీనియర్ టాప్ హీరోలైన బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ సరసన నటించిన ఛార్మి. ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ సంస్థలో నిర్మాతగా కొనసాగుతుంది. ఆమె కథానాయికగా కనిపించిన చివరి సినిమా జ్యోతిలక్ష్మి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.