గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఫోటోస్ తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో స్టార్ హీరో చిన్ననాటి పిక్ నెట్టింటిని షేక్ చేస్తుంది. ఎవరో గుర్తుపట్టండి. పైన కనిపిస్తోన్న ఆ ఫోటోలో ఓ స్టార్ హీరో ఉన్నారు. ఆయన ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. అయన కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. ఆయన పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే. ఈ హీరో నటించిన సినిమా వచ్చిందంటే.. థియేటర్లలో రచ్చే ఇక. ఎవరో గుర్తుపట్టండి. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకోవడమే కాకుండా.. ఇప్పటికీ వరుస చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటారు. ఆయన ఎవరో కనిపెట్టండి.
పైన ఫోటోలో స్నేహితులతో కలిసి ఉన్న ఆ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పవన్.. తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జానీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాదు.. సింగర్‌గానూ తన చిత్రాల్లో పలు పాటలు పాడి అదరగొట్టారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన పవన్.. ప్రస్తుతం ప్రజలకు సేవ చేసేందుకు జనసేన పార్టీ ప్రారంభించారు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటు పడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్ స్టార్ గతంలో తెలిపారు.
అంతేకాదు.. గూగుల్లో అత్యంత ఎక్కువగా సెర్చ్ చేసే రాజకీయవేత్తగా నిలిచాడు పవన్. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ నటించనున్నారు. అలాగే డైరెక్టర్ సముద్రఖని, డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో మరో రెండు ప్రాజెక్ట్స్ చేయనున్నారు పవన్. అటు వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఇటు రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.