
బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్‌లో కేవలం కొన్నిమాత్రమే ప్రేక్షకుల మనసులలో నిలిచిపోతాయి. చక్రవారం.. మొగలి రేకులు వంటి సీరియల్స్ ఇప్పటికీ మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందులోని నటీనటులకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇష్టమైన నటీనటులు ఎక్కువే. ఇక ప్రస్తుతం టెలివిజన్ లో టాప్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ హీరో కార్తిక్.. డాక్టర్ బాబు.. అలియాస్ నిరూపమ్ కు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అతని తర్వాత మరో కుర్రాడికి భారీగా ఫాలోయింగ్ వచ్చేసింది. తన నటనతో మెప్పిస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టగలరా ? ఆ చిన్నోడు నటిస్తోన్న సీరియల్ ఇప్పుడు టాప్ 2లో ఉందండి.
తల్లి ప్రేమ అంటే ఎంటో తెలియని కుర్రాడిగా.. అన్ని తానై చూసుకున్న నాన్న అంటే పడిచచ్చే ప్రేమున్న అబ్బాయిగా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ కోపంగా.. ఇగో పర్సన్ గా కనిపించే ఈ కుర్రాడు తన స్టూడెంట్తోనే ప్రేమలో పడిపోతాడు. ఎవరో గుర్తుపట్టే ఉంటారు కదూ.. తనే గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషేంద్ర భూషణ్.. (రిషి). ఇందులో అతని నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ముఖ్యంగా తల్లి జగతి.. తండ్రి మహేంద్ర.. రిషి మధ్య వచ్చే సన్నివేశాలు మనసులను పిండేస్తాయి. ఎప్పుడూ కోపంగా.. ఇగో పర్సన్ గా కనిపించే రిషి.. వసుధార ప్రేమలో మాత్రం ఎంతో అల్లరి.. చిలిపిగా కనిపిస్తాడు.అందుకే అతనికి ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఇటీవల ఓ రియాల్టీ షోలో తన తండ్రిని పరిచయం చేసి మరోసారి ఆడియన్స్ మనసు దొచుకున్నాడు. తన తండ్రి పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉంటే.. అన్నీ తానై చూసుకుంటున్నాడు. మా నాన్నని నేను నాకు పుట్టిన కొడుకులా చూసుకున్నాను. అందరి జీవితంలో జరుగుతుందో లేదో నాకు తెలియదు.కానీ నా జీవితంలో జరిగింది అంటూ రిషి చెప్పడం అందరి కన్నుల్లు చెమ్మగిల్లేలా చేసింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.