AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు.. ఇప్పుడు మనసిచ్చిన అమ్మాయితో మనువు.. ఈ టాలీవుడ్ డైరెక్టర్‌ను గుర్తు పట్టారా?

చాలామంది హీరోల్లాగే ఇతను కూడా షార్ట్‌ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. యూత్‌ను ఆకట్టుకునే కంటెంట్‌తో మంచి షార్ట్ ఫిల్మ్స్ రూపొందించాడు. ఇదే క్రేజ్‌తో మెగా ఫోన్ పట్టుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు.

మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు.. ఇప్పుడు మనసిచ్చిన అమ్మాయితో మనువు.. ఈ టాలీవుడ్ డైరెక్టర్‌ను గుర్తు పట్టారా?
Tollywood Director
Basha Shek
|

Updated on: Nov 14, 2024 | 7:27 PM

Share

పై ఫొటోలోఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు ఇతను టాలీవుడ్ లో బాగా ఫేమస్. చాలామంది లాగే షార్ట్స్ ఫిల్మ్స్ తో తన కెరీర్ ఆరంభించాడు. యువతను ఆకట్టుకునే కంటెంట్ తో షార్ట్స్ ఫిల్మ్స్ రూపొందించి టాలీవుడ్ ప్రముఖుల మన్ననలు అందుకున్నాడు. వారితోనే క్రమంగా పరిచయాలు పెంచుకున్నాడు. ఇదే క్రమంలో ఒక మంచి సందర్భం చూసుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సరిగ్గా కరోనా కష్టకాలంలో మెగా ఫోన్ పట్టుకుని అప్పటికీ పెద్దగా గుర్తింపు లేని ఒక చిన్న హీరోతో తన మొదటి సినిమాను పట్టాలెక్కించాడు. కోవిడ్ కాబట్టి ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం లేకపోవడంతో డైరెక్టుగా ఓటీటీలోనే తన సినిమాను రిలీజ్ చేశాడు. అంతే ఈ డైరెక్టర్ పేరు మార్మోగిపోయింది. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా ఒక హృద్యమైన ప్రేమకథను అద్భుతంగా తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తనలోని ప్రతిభకు ప్రతీకగా ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇలా టాలీవుడ్ లో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈ క్రేజీ డైరెక్టర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. తన మొదటి సినిమాలో నటించిన ఒక అమ్మాయిపై మనసు పారేసుకున్న ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు అదే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. మరి.. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్.

కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్స్ ఫిల్మ్స్ ను తెరకెక్కించాడు సందీప్ రాజ్. అలాగే ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ వంటి కొన్ని సినిమాల్లో సహాయక నటుడి పాత్రలు పోషించాడు. ఇక కలర్ ఫొటో తో డైరెక్టర్ గా మారి జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన మొదటి సినిమాలో నటించిన చాందినీ రావు అనే అమ్మాయితో కలిసి త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. డిసెంబర్ 7న ఏడు కొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో సందీప్ రాజ్- చాందినీలు పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

సందీప్, చాందినీ ల ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sandeep Raj (@sandeepraaaj)

తిరుపతిలో వివాహం..

చాందినీ రావుతో డైరెక్టర్ సందీప్ రాజ్..

View this post on Instagram

A post shared by Chandni Rao (@_chandnirao)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు