AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ ఇలా మారిపోయాడేంటి? ఎవరో గుర్తు పట్టారా?

అతను చూడడానికి బక్క పలుచని దేహంతో సింపుల్ గా ఉంటాడు. పొడవాటి జట్టు, గుబురు గడ్డంతో ఒక స్వామీజీలా కనిపిస్తుంటాడు. అయితే ఇప్పుడు మాత్రం ఇలా గుండుతో ప్రత్యక్షమై అందరికీ షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు సినిమా షూటింగులు, ప్రమోషన్లతో బిజీ బిజీగా గడిపిన ఈ స్టార్ డైరెక్టర్ తాజాగా ఒక ప్రముఖ దేవాలయానికి వెళ్లాడు. తల నీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నాడు. మరి ఈ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా?

Tollywood: ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ ఇలా మారిపోయాడేంటి? ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Director
Basha Shek
|

Updated on: Aug 19, 2024 | 7:59 AM

Share

పై ఫొటోలో తలనీలాలు సమర్పించి గుండుతో కనిపిస్తున్నదెవరో గుర్తు పట్టారా? అతనొక స్టార్ డైరెక్టర్. అలాగనీ అతను ఎక్కువగా సినిమాలేమీ చేయలేదు. ముచ్చటగా మూడు సినిమాలు తీశాడు అంతే. అయితేనేం ఇప్పుడతను సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్. ఈ ఏడాది తన సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. అతను చూడడానికి బక్క పలుచని దేహంతో సింపుల్ గా ఉంటాడు. పొడవాటి జట్టు, గుబురు గడ్డంతో ఒక స్వామీజీలా కనిపిస్తుంటాడు. అయితే ఇప్పుడు మాత్రం ఇలా గుండుతో ప్రత్యక్షమై అందరికీ షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు సినిమా షూటింగులు, ప్రమోషన్లతో బిజీ బిజీగా గడిపిన ఈ స్టార్ డైరెక్టర్ తాజాగా ఒక ప్రముఖ దేవాలయానికి వెళ్లాడు. తల నీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నాడు. మరి ఈ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా? అతను మరెవరో కాదు బ్లాక్ బస్టర్ మూవీ కల్కి లాంటి అద్భుతమైన కళా డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తాజాగా అరుణాచలేశ్వర ఆలయాన్ని సందర్శించాడీ స్టార్ డైరెక్టర్. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అలాగే తల నీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నాడు. స్వామి వారి ఆశీస్సులు అందుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఎప్పుడూ ఒత్తైన జుట్టు, గుబురు గడ్డంతో కనిపించే నాగీ ఇప్పుడు గుండుతో కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కొంత మంది అయితే అసలు గుర్తు పట్టడం లేదు కూడా. ఇప్పుడు ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జూన్ 27న విడుదలైన కల్కి ఓవరాల్ గా రూ.1200 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, లోక నాయకుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కల్కి సినిమాను నిర్మించారు. కాగా కల్కి తర్వాత దీని సీక్వెల్ కల్కి 2ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు నాగ్ అశ్విన్. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే సినిమా ఎప్పుడు వస్తుందన్నది మాత్రం సస్పెన్స్ లో ఉంచారు.

ఇవి కూడా చదవండి

కల్కి 50 డేస్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.