
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని సినిమా తారలందరూ విదేశాలకు క్యూ కట్టారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొనేందుకు ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ కు వెళ్లిపోయారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం డిఫరెంట్ గా హిమాలయాల్లో ఎంజాయ్ చేస్తోంది. అది కూడా చలి కాలంలో. ఈ సందర్భంగా తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో అవి నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అలా పై ఫొటోల్లో ఉన్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? పేరుకు మలయాళ హీరోయినే అయినా ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోందీ అందాల తార. తన అందం, అభినయంతో తెలుగు నాట జెట్ స్పీడ్ లో దూసుకెళుతోందీ అందాల తార. ఆ మధ్యన కాస్త డల్ అయినా మళ్లీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ ఈ సొగసరి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో సుమారు ఏడు సినిమాలు ఉన్నాయి. అవి కూడా దాదాపు అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయిన ఈ బ్యూటీ మరెవరో కాదు ఇటీవలే అఖండ 2 సినిమాలో మెరిసిన సంయుక్త మేనన్.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన అఖండ 2 సినిమాలో పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించింది సంయుక్త. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ప్రస్తుతం ఈ మలయాళం బ్యూటీ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, బెల్లంకొండ శ్రీనివాస్ హైందవ, నిఖిల్ స్వయంభు, పూరీ-విజయ్ సేతుపతి సినిమా, రాఘవ లారెన్స్ ‘బెంజ్’, మలయాళంలో మోహన్‌లాల్ ‘రామ్’ తదితర సినిమాల్లో నటిస్తోందీ అందాల తార. ఇందులో చాలా సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్టులే. వీటిలో శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చేసిన సినిమాలన్నీ హిట్ కావడం, ఇప్పుడు చేతి నిండా సినిమాలు ఉండడంతో తెలుగులో లక్కీ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుందీ అందాల తార.