Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్

మొన్నటివరకు ఈ నటికి సోషల్ మీడియాలో అకౌంట్సే లేవు. కానీ ఈ మధ్యనే ఇన్ స్టా గ్రామ్ లోకి అడుగు పెట్టింది. అంతే అప్పటి నుంచి తన ఫ్యామిలీ, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్
Pawan Kalyan Wife Anna Lezhneva

Updated on: Apr 13, 2026 | 4:21 PM

పై ఫొటోలో గిటారో వాయిస్తోన్న పాపను గుర్తు పట్టారా? మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె హీరోయిన్ గా తెలుగులో చేసింది ఒక్క సినిమానే. కానీ ఆ ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. ఎందుకంటే ఆ సినిమా హీరోతోనే ప్రేమలో పడిందీ అందాల తార. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లిపీటలెక్కారు. అయితే పెళ్లయ్యాక సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైందామె. భర్త, పిల్లలకే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. మొన్నటివరకు ఆమెకు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు. కొన్ని రోజుల క్రితమే ఇన్ స్టా గ్రామ్ లోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆమె తన చిన్ననాటి ఫొటోను షేర్ చేసింది. మరి అందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా

ఈ మధ్యన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న అన్నా లెజినోవా ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. తన చిన్న ప్పటి ఫొటో షేర్ చేస్తూ.. ‘ఈ చిన్నారిని నేనే. అప్పుడు నాకు ఏడేళ్ల వయసు అనుకుంటా. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చలికాలం. నా చేతులు అప్పటికీ చాలా చిన్నవి అయినా ఓ సంగీత పాఠశాలలో పెద్ద వేదికపై ఒక సీరియస్ టర్మ్ కచేరీలో నేను నిలబడి ఉన్నాను. అప్పుడు నేను లుడ్విగ్ వాన్ బీథోవెన్ రచించిన ‘లా మార్మోట్’ వాయిస్తున్నాను. నా గురువు పియానో ​​వద్ద నా పక్కన కూర్చుని, నాకు సహకరిస్తూనే, నన్ను ముందుండి నడిపించారు. మూడేళ్ల తర్వాత నేనే స్వయంగా పియానో ​​వాయించడం మొదలుపెట్టాను.

ఇవి కూడా చదవండి

అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్..

‘నేను ఐదేళ్ల వయసులో వయోలిన్ నేర్చుకోవడం ప్రారంభించాను. పాఠశాలతో పాటు పదిహేనేళ్ల వయసు వరకు సంగీత పాఠశాలకు హాజరయ్యాను. నేను సంగీతాన్న వృత్తిగా స్వీకరించనప్పటికీ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతం ఎల్లప్పుడూ నాలో ఒక భాగంగానే ఉన్నాయి. నేను ఇండియాకు వచ్చినప్పుడు నా భర్త నాకు ఒక పియానో ​​కొనిచ్చారు. వయోలిన్ కూడా ఇక్కడే కొనిచ్చారు. అవి పెట్టెలో భద్రంగా ఉన్నాయి. కానీ ఈ మధ్య నాకు వాయించాలనే తపన కలగడం లేదు. ఆ సంగీతం ఇంకా నాలోనే ఎక్కడో ఉండిపోయి మళ్లీ వినబడటానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. సంగీతం భాష, నేపథ్యానికి అతీతంగా మనుషులను కలుపుతుంది. మ్యూజిక్ ద్వారా మనం ఒక్క మాట కూడా మాట్లాడకుండానే బాధను, ప్రేమను, ఆనందాన్ని అనుభూతి చెందగలం. అది సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య, ఖండాల మధ్య ఒక వారధి’ అంటూ తనదైన శైలిలో రాసుకొచ్చింది అన్నా లెజినోవా.

ప్రస్తుతం పవన్ కల్యాన్ సతీమణి షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ భార్యలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us