Tollywood: ఈ నాట్య మయూరిని గుర్తు పట్టారా? రెండు సినిమాలతోనే సెన్సేషన్.. డ్యాన్స్, మ్యూజిక్ టీచర్ కూడా..

హైదరాబాదులోనే పుట్టి పెరిగింది. ఇక్కడే చదువుకుంది. చిన్నతనం నుంచే కూచిపూడి నేర్చుకుంది. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది. ఓ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తే ఈ అమ్మాయి కూడా హాజరైంది. చివరకు ఈ బ్యూటీనే హీరోయిన్ గా ఫైనల్ చేయడం విశేషం.

Tollywood: ఈ నాట్య మయూరిని గుర్తు పట్టారా?  రెండు సినిమాలతోనే సెన్సేషన్.. డ్యాన్స్, మ్యూజిక్ టీచర్ కూడా..
Tollywood Actress

Updated on: Sep 09, 2025 | 8:45 PM

పై ఫొటోలో నాట్యం చేస్తోన్న అమ్మాయిని చూశారా? ఎంతో క్యూట్ గా ఉంది కదా? అందుకే ఇప్పుడు హీరోయిన్ గా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సొగసరి పేరు మార్మోగిపోతోంది. అలాగనీ ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలేవీ చేయలేదు. ఇప్పటివరకు మొత్తం మూడు సినిమాలు చేసింది. అందులో మొదటిది సపోర్టింగ్ రోల్ అయితే మిగతావి హీరోయిన్ పాత్రలు. మొదటి సినిమా సంగతి పక్కన పెడితే.. మిగతా రెండు సినిమాలు ఈ బ్యూటీకి ఎనలేని క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆ అందం, అభినయం, ఎక్స్ ప్రెషన్స్ కుర్రాళ్లకు ఫేవరెట్ గా మార్చేశాయి. చూడగానే పక్కింటమ్మాయిలా కనిపించే ఈ అందానికి ఇప్పుడుండే క్రేజే వేరు. అన్నట్లు ఈ హీరోయిన్ బ్యూటీ విత్ మల్టీపుల్ ట్యాలెంట్. చిన్నప్పుడే కూచిపుడి నృత్యంలో శిక్షణ తీసుకుంది. ఎన్నో నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఇప్పటికీ ఖాళీ సమయం దొరికతే డ్యాన్స్, మ్యూజిక్ తదితర అంశాల్లో పిల్లలకు పాఠాలు కూడా చెబుతోంది.

గత శుక్రవారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో అనుష్క ఘాటి, శివ కార్తికేయన్ మదరాసి వంటి పెద్ద సినిమాలున్నాయి. అయితే ఈ రెండు సినిమాలను కాదని ఒక చిన్న సినిమా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతోంది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటికే లాభాల్లోకి కూడా అడుగు పెట్టింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. పై ఫొటోలో ఉన్నది లిటిల్ హార్ట్స్ అంటూ మరోసారి కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టిన శివానీ నాగారం.

ఇవి కూడా చదవండి

శివానీ లేటెస్ట్ ఫొటోస్..

1988లో హైదరాబాదులో పుట్టిన శివానీ విల్లా మేరీ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ చేసింది. ‘అంత‍ర్గత’ అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా మారింది. 2020లో మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇన్ స్టాలో చూసి ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ ఆడిషన్స్ ఉందని తెలిసి వెళ్లింది. తీరా అక్కడకు వెళితే హీరోయిన్ గా ఎంపికైంది. మొదటి సినిమా కంటే ముందు ‘జాతిరత్నాలు’లో న్యూస్ ప్రెజెంటర్‌గా చిన్న పాత్రలో కనిపించింది. ఇ‍ప్పుడు ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో కాత్యాయనిగా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న ‘హే భగవాన్’ అనే మూవీలో హీరోయిన్‌గా చేస్తోందీ అందాల తార. దీంతో పాటు ప్రస్తుతమున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని సినిమా అవకాశలు కూడా రావొచ్చు.

లిటిల్ హార్ట్స్ ప్రమోషన్లలో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి