AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ఎన్టీఆర్‌తో ఉన్న ఈ పిల్లోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. అమ్మాయిలు పడి చస్తారు

ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా ఈ టాలీవుడ్ హీరోకు క్రేజ్ ఎక్కువ. కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అందులోనూ ఈ హ్యాండ్సమ్ హీరో అంటే అమ్మాయిలు అయితే పడి చస్తారు.

Jr NTR: ఎన్టీఆర్‌తో ఉన్న ఈ పిల్లోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. అమ్మాయిలు పడి చస్తారు
Jr NTR
Basha Shek
|

Updated on: Jul 07, 2026 | 6:21 PM

Share

పై ఫొటోలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? చూడ్డానికి ఎంతో క్యూట్‌గా, చబ్బీగా ఉన్నాడు కదా. తెలుగు సినిమాలు బాగా చూసే వారు అయితే ఈ పిల్లాడు ఎవరో ఈజీగా గుర్తుపట్టేసే ఉంటారు. ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్‌లో ఫేమస్ హీరో. యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. అమ్మాయిల కలల రాకుమారుడు. తాత, తండ్రుల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. 2015లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతను ఈ 11 ఏళ్లలో కేవలం ఏడు సినిమాలు మాత్రమే చేశాడు. అయితే ఒకటి, రెండు మాత్రమే హిట్స్ ఉన్నాయి. దీంతో ఒక గట్టి బ్లాక్ బస్టర్ కోసం ఈ హీరో ఎదురు చూస్తున్నారు. అభిమానులు కూడా అయ్యగారికి ఒక్క గట్టి హిట్‌ పడితే స్టార్‌ హీరోల లిస్టులోకి చేరిపోతాడంటున్నారు. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్‌. పై ఫొటోలో జూనియర్‌తో ఎన్టీఆర్‌తో ఉన్నది మరెవరో కాదు టాలీవుడ్‌ యువ సామ్రాట్‌ అఖిల్‌ అక్కినేని.

అఖిల్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా లెనిన్. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో చిత్ర బృందం గట్టిగానే ప్రమోషన్లు చేస్తోంది. కాగా లెనిన్ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో డబ్బింగ్ స్టూడియోలో ఎన్టీఆర్, అఖిల్ ఇద్దరూ ఎంతో సంతోషంగా ముచ్చటించుకుంటున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇదే క్రమంలో అఖిల్ చిన్న వయసులో ఎన్టీఆర్ తో దిగిన ఫొటో కూడా నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ తో అక్కినేని అఖిల్..

ఇక పై ఫొటో విషయానికి వస్తే.. సాంబ సినిమా షూటింగ్ లో దిగినట్లు తెలుస్తోంది. అప్పుడు ఎన్టీఆర్‌ కొంచెం బొద్దుగా ఉన్నాడు. అ సమయంలోనే అఖిల్ ఎన్టీఆర్ తో సరదాగా ఫొటో దిగినట్లు సమాచారం. ‌ అప్పుడు అఖిల్ వయసు సుమారు పదేళ్లు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా