పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఠక్కున చూసి ఎవరీ ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ ఫొటోలో ఉన్నది అమ్మాయి కాదు టాలీవుడ్ ఫేమస్ హీరో. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తోన్న ఆ హీరో లేటస్ట్ సినిమా స్టిల్ ఇది. ఇందులో అతను అమ్మాయిగా, అబ్బాయిగా నటిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా తన సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో స్టార్ హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా ఎంతో అందంగా కనిపించాడీ హ్యాండ్సమ్ హీరో. మరి అతనెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. అతను మరెవరో కాదు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. మెకానిక్ రాఖీ తర్వాత అతను నటిస్తోన్న చిత్రం లైలా. ఇందులో విశ్వక్ అమ్మాయి పాత్రలో కనిపించనున్నాడు. పై ఫొటో అదే. రామ్ నారాయాణ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయిక. ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్‌లో విశ్వక్‌సేన్ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి సందర్భంగా విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌లోని కొత్త స్టిల్‌ను విడుదల చేశారు.
కాగా గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అభిమానులను పలకరించాడు విశ్వక్ సేన్. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించాడు. ఇప్పుడు లైలాగా మరోసారి మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు వస్తున్నాడీ యంగ్ హీరో. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. ప్రమోషన్లలో భాగంగా ఈనెల 17న సినిమా టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. అలాగే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న లైలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు.
#Laila wishes you a Happy Sankranthi 🩷#LailaTeaser out on January 17th ✨
GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹
@RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7 @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/vlgUDRDkAz
— VishwakSen (@VishwakSenActor) January 14, 2025
Congratulations #NBK sir 🔥💥💥#DaakuMaharaj pic.twitter.com/YQigBqVQNW
— VishwakSen (@VishwakSenActor) January 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.