Tollywood: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు.. క్రేజ్ చూస్తే మెంటలెక్కిపోద్ది
పై ఫొటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడీ పిల్లాడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. పేరుకు టాలీవుడ్ నటుడే అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట ఛైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగానూ అదరగొడుతున్నాడు. చిన్న వయసులోనే మాస్ హీరోగా అభిమానుల మన్ననలు అందుకున్న ఈ హీరో..
పై ఫొటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడీ పిల్లాడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. పేరుకు టాలీవుడ్ నటుడే అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట ఛైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగానూ అదరగొడుతున్నాడు. చిన్న వయసులోనే మాస్ హీరోగా అభిమానుల మన్ననలు అందుకున్న ఈ హీరో లవ్, రొమాన్స్, కామెడీ, సోషియో ఫాంటసీ సినిమాలతోనూ సత్తా చాటాడు. ఇక ఈ స్టార్ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పేరు విన్నా, స్క్రీన్ పై కనిపించినా ఫ్యాన్స్ కు ఇక పూనకాలే. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకెళుతోన్న ఈ హీరో ఎవరో ఈపాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్.. ఈ బుడ్డోడు మరెవరో కాదు ప్రస్తుతం దేవర సినిమాతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోన్నమ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఇది అతని చిన్న నాటి ఫొటో. దేవర సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోన్న నేపథ్యంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. పై ఫొటో అందులోదే.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘దేవర’ మానియానే కనిపిస్తోంది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో తారక్ డబుల్ రోల్ తో అభిమానులను మెస్మరైజ్ చేశాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించాడు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతూ ఎన్టీఆర్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. తొలి రోజున రూ.172 కోట్ల వసూళ్లను సాధించిన దేవర ఈ వారాంతం ముగిసే వరకు అంటే మూడు రోజుల్లోనే రూ.304 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించటం విశేషం. ఇదే జోరు కొనసాగితే దేవర మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్.
మూడు రోజుల్లోనే 304 కోట్లు..
A hurricane named #Devara… has wiped out every nook and corner with his ‘X’ style of destruction 🔥🔥#BlockbusterDevara pic.twitter.com/YiISj6swf2
— Devara (@DevaraMovie) September 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.