విలన్.. ప్లే బ్యాక్ సింగర్.. ప్రొడ్యూసర్.. ఫైనల్లీ పాన్ ఇండియా సూపర్ హీరో.. ఇలా సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడీ నటుడు. మొన్నటివరకు ఇతని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఈ మధ్యన ఈ హీరో పేరు తెగ మార్మోగిపోతోంది. అందుకు కారణం అతను నటించిన ఒకే ఒక్క సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో రికార్డు వసూళ్లు సాధిస్తోంది. అన్నిటికీ మించి ఇప్పటివరకు మన దేశంలో ఇప్పటివరకు ఇలాంటి వయలెంట్ మూవీ రాలేదు. గతేడాది రిలీజైన కిల్ సినిమాకు మించి ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అందుకే దక్షిణాది ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఇప్పటికే వంద కోట్లకు చేరువైన ఆ మూవీ ఏదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. యస్ అదే మార్కో. ఇందులో ఉన్నది ఆ సినిమా హీరో ఉన్ని ముకుందన్. ఇది అతని టీనేజ్ నాటి ఫొటో. మార్కో ప్రభంజనం నేపథ్యంలో ఉన్ని ముకుందన్ చిన్న నాటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఉన్ని ముకుందన్ గతంలో పలు తెలుగు సినిమాల్లోనూ నటించాడు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో నెగెటివ్ రోల్ లో కనిపించాడు. అనుష్క భాగమతిలో ఓ కీలక పాత్ర పోషించాడు. రవితేజ ఖిలాడీ, సమంత యశోద సినిమాల్లోనూ అతను పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. మల్లికాపురం వంటి సినిమాల్లో హీరోగా నటించిన ముకుందన్ ఇప్పుడు మార్కోతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తోంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకక్కిన ఈ మూవీ యాక్షన్ లవర్ ను తెగ అలరిస్తోంది. అందుకే 100 కోట్లకు చేరువలో ఉంది.\
#Marco TAMIL in cinemas from Jan 3rd! #Marco TELUGU in Tamil Nadu from today! Jan 1st.
Book your tickets now!! pic.twitter.com/wkw3U2nuVv
— Unni Mukundan (@Iamunnimukundan) January 1, 2025
#Marco TELUGU in TAMIL NADU from Jan 1st !! #Marco TAMIL in TAMIL NADU from Jan 3rd !! pic.twitter.com/eFE3GGhp1I
— Unni Mukundan (@Iamunnimukundan) December 31, 2024
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .