Tollywood: అవమానం ఎదురైన చోటే తలెత్తుకుని.. ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? చాలామందికి ఫేవరెట్

|

Oct 23, 2024 | 5:14 PM

ఏదైనా పోతే పోగొట్టుకున్న చోటే వెతకాలి అంటుంటారు మన పెద్దలు. పై ఫొటోలో కనిపిస్తున్న ఈ టాలీవుడ్ హీరోకు ఈ మాట అక్షరాలా వర్తిస్తుంది. అవును.. చాలా మంది లాగే ఇతను కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కష్టాలు అనుభవించాడు. కానీ గోడకు కొట్టిన బంతిలా ధైర్యంగా తిరిగొచ్చాడు. ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో అక్కడే తలెత్తుకుని నిలబడ్డాడు.

Tollywood: అవమానం ఎదురైన చోటే తలెత్తుకుని.. ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? చాలామందికి ఫేవరెట్
Tollywood Actor
Follow us on

తెలుగు ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ షోల్లో ఢీ కూడా ఒకటి. ఈ షో చాలామంది డ్యాన్సర్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి వేదికగా నిలిచింది. అలా ఇదే డ్యాన్స్ రియాల్టీ షోకు కంటెస్టెంట్ గా వచ్చాడు పై నున్న హీరో. కానీ తన డ్యాన్స్ చూసిన జడ్జీలు, ఆడియెన్స్ పెదవి విరిచారు. ముఖం మీదే అవమానించారు.. కట్ చేస్తే.. అదే కొన్నేళ్ల తర్వాత అదే ఢీ డ్యాన్స్ రియాల్టీ షోకు హోస్ట్ గా వచ్చాడు. తన పంచులు, ప్రాసలు, కామెడీ టైమింగ్ తో షోను బాగా ఎలివేట్ చేశాడు. ఇప్పుడు హీరోగానూ అదృష్టం పరీక్షించుకుంటోన్న ఈ అబ్బాయిని చాలా మంది గుర్తు పట్టేసే ఉంటారు. యస్.. అతను మరెవరో కాదు బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. బుధవారం (అక్టోబర్ 23) అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ప్రదీప్ మాచిరాజుకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

ఎన్నో సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ప్రదీప మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగానూ మారిపోయాడు. ఇందులోని పాటలు సూపర్ హిట్ గా నిలిచినా మూవీ మాత్రం ఆ రేంజ్‌ లో మెప్పించలేకపోయింది. ఈ మూవీ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ప్రదీప్ ఇటీవలే రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. అది కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ తో. పవన్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ పేరునే తన రెండో సినిమా టైటిల్ గా పెట్టుకున్నారు ప్రదీప్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ యాంకర్ దీపికా పిల్లి నటిస్తుండడం మరో విశేషం. ఇటీవలే రిలీజైన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ప్రదీప్ పుట్టిన రోజు సందర్భంగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుండి ప్రదీప్ కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అది కాస్తా వైరల్ అవుతుంది.

ప్రదీప్ బర్త్ డే స్పెషల్ పోస్టర్..

పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ తో..

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మోషన్ పోస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.