సినిమా వాళ్లకు సంబంధించిన ఫొటోలో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. సోషల్ మీడియా వాడకం ఎక్కువ అవ్వడంతో సెలబ్రెటీల ప్రొఫిషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఫొటోలతో పాటు టీవీ సీరియల్ నటులు, అలాగే యాంకర్స్ కు ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ యాంకర్ కు సంబందించిన చైల్డ్ హుడ్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో ఉన్న యాంకరమ్మను గుర్తుపట్టడం చాలా కష్టం. కనిపెడితే మీరే తోపులు. ఆమె అందం, మాటలు, చలాకీ తనం ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఇంతకూ ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?
పై ఫొటోలో ఉన్న యాంకర్ టీవీ షోలతో పాటు, సినిమాల్లోనూ నటించి మెప్పించింది. పదుల సంఖ్యలో టీవీ షోలు చేసింది. ఇప్పుడు ఆమె కాస్త సైలెంట్ అయ్యింది ఆ యాంకర్. ఆమెను జూనియర్ శ్రీదేవి అని అంటుంటారు. ఇంతకూ ఆమె ఎవరో కాదు ఉదయభాను. ఈ అందాల యాంకర్ ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంలో ప్రేక్షకులవద్దకు వెళ్ళి వారితో సరదాగా మాట్లాడించడం ద్వారా పాపులర్ అయ్యింది.
ఉదయభాను యాంకర్ గా సినిమాలు చేస్తూనే సినిమాల్లోనూ నటించింది. 10 వతరగతి చదువుతుండగా మొదటి సినిమా ఎర్ర సైన్యంలో చేసింది. తరువాత కొన్ని తమిళ, కన్నడ సినిమాలో నటించింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది ఉదయభాను. ఇక ఉదయభాను చేసిన టీవీ షోల్లో వన్స్ మోర్ ప్లీజ్ , సాహసం చేయరా డింబకా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా చాలా షోల్లో యాంకర్ గా చేసి మెప్పించింది. ఇప్పుడు ఉదయభాను యాంకరింగ్ కు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.