AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు అప్పుడు అర్థం కాలేదు.. అతని ప్రేమ కోసం సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా: నయన్

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుసగా సినిమాలు చేస్తుంది. లేడీ ఓరియెంటడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు రీసెంట్ గా హిందీలోనూ నటించి ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. అలాగే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

నాకు అప్పుడు అర్థం కాలేదు.. అతని ప్రేమ కోసం సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా: నయన్
Nayanthara
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2024 | 6:08 PM

Share

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పవర్ ఫుల్ పాత్రలతో ‘లేడీ సూపర్ స్టార్’గా గుర్తింపు పొందింది ఈ అందాల భామ. నయన్ గురించి చాలా మంది తెలిసే ఉంటుంది. ఆమె సినీ లైఫ్ తో పాటు వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలిచింది. 2011 లో నయన్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకున్న విషయం మీకుతెలుసా.? అవును అప్పుడు నయనతార సినిమాలకు పూర్తిగా దూరం అవ్వాలని అనుకుంది. ఆతర్వాత రెండు సంవత్సరాలు సైలెంట్ గా ఉంది. కానీ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయ్యింది. ఇప్పుడు ఆమె ఓ స్టార్ హీరోయిన్. నయనతార ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి కవల పిల్లలు ఉన్నారు. నయనతార జీవితంలోకి విఘ్నేష్ రాకముందు, ఆమె కొరియోగ్రాఫర్, డాన్సర్ మరియు దర్శకుడు ప్రభుదేవాతో డేటింగ్ చేసేది.

ఇది కూడా చదవండి :Tollywood : అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ హీరోయిన్

అప్పట్లో ప్రభుదేవ ప్రేమ కోసం తన నట జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు నయనతార వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. “ గతంలో నా జీవితంలో ప్రేమ కావాలంటే, నేను కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని నేను భావించే దశలో ఉన్నాను. ఆ సమయంలో నేను చాలా సున్నితంగా ఉండేదాన్ని. మా ఇండస్ట్రీలో చాలా రిలేషన్స్‌ని చూశాను. వారు చెడ్డవారని నేను చెప్పడం లేదు, కానీ అది ఆ విధంగా ఉండటం మేము చూశాము. అందుకే ఆ సమయంలో ఓకే అనుకున్నాను. ప్రేమ కావాలంటే ఎక్కడో ఒకచోట రాజీ పడాల్సిందేనని నాలోని నిజాయితీ గల అమ్మాయి భావించింది అని నయన్ అన్నారు.

ఇది కూడా చదవండి : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..! ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..

అలాగే ఆమె మాట్లాడుతూ.. మీరు మీ అన్నింటినీ మీ ప్రేమకోసం వదులుకోవాలి. మీరు చేస్తున్న పని మీ భాగస్వామికి నచ్చకపోతే, మీరు దానిని వదులుకోవాలి. ఆ సమయంలో ప్రేమపై నాకున్న అవగాహన అదే. కానీ నేను ఆతర్వాత స్ట్రాంగ్ అయ్యాను. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే ఆ బంధం వల్లనే. ఆ బంధం లేకుంటే ఇంత దూరం వచ్చేంత శక్తి నాకు ఉండేది కాదు. నాకు ఎంత సామర్థ్యం ఉందో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ సంబంధం తర్వాత, నేను ఇప్పుడు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మార్చుకున్నాను” అని నయనతార చెప్పుకొచ్చింది. అదేవిధంగా  “సినిమా అనేది వ్యాపారం మాత్రమే కాదని నేను గ్రహించాను. ఇది డబ్బు, కీర్తి గురించి మాత్రమే కాదు. కానీ అది నా జీవితంలో అంతర్భాగమైపోయింది. ఇది నేను నటించడానికే పుట్టాను. ఆఖరికి ‘శ్రీరామరాజ్యం’ చేసినప్పుడు సినిమాలకు దూరంగా ఉండలేనని అర్థమైంది’’ అని నయనతార చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :హేయ్..! మళ్ళీరావా పాప నువ్వేనా ఇది.. హీరోయిన్స్ కుళ్ళుకునేలా మారిపోయిందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!