Guess The Actor: భార్య కౌగిలిలో బందీ అయిన టాలీవుడ్‌ హీరో.. ఈ రొమాంటిక్‌ కపుల్‌ ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్న టాలీవుడ్‌ రొమాంటిక్‌ కపుల్‌ను గుర్తుపట్టారా? తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యూట్‌ జంటకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. భర్త పాన్‌ ఇండియా హీరో అయితే.. భార్య హీరోయిన్లకు మించి క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఇక వీరి పిల్లలు కూడా స్టార్‌ కిడ్స్‌గా నెట్టింట ఓ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఈ లవ్లీ కపుల్ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

Guess The Actor: భార్య కౌగిలిలో బందీ అయిన టాలీవుడ్‌ హీరో.. ఈ రొమాంటిక్‌ కపుల్‌ ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Couple

Updated on: Nov 11, 2023 | 4:41 PM

పై ఫొటోలో ఉన్న టాలీవుడ్‌ రొమాంటిక్‌ కపుల్‌ను గుర్తుపట్టారా? తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యూట్‌ జంటకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. భర్త పాన్‌ ఇండియా హీరో అయితే.. భార్య హీరోయిన్లకు మించి క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఇక వీరి పిల్లలు కూడా స్టార్‌ కిడ్స్‌గా నెట్టింట ఓ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఈ లవ్లీ కపుల్ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. భార్యాభర్తలిద్దరూ రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఈ ఫొటోను చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఈ లవ్లీ కపుల్‌ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? భార్య కౌగిలిలో బంధీ అయిన ఈ స్టార్‌ హీరో ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. యస్‌.. ఈ ఫొటోలో ఉన్నది మరెవరో కాదు అల్లు అర్జున్‌, అతని సతీమణి స్నేహా రెడ్డి. సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ గా ఉండే బన్నీ సతీమణి ఈ రొమాంటిక్‌ ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో తన భర్తని కౌగిలిలో బంధించి రొమాంటిక్ గా ముద్దు ఇస్తూ కనిపించింది స్నేహ. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారింది. రొమాంటిక్ గా ఉన్న అల్లు అర్జున్‌ దంపతులని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. భార్య కౌగిలిలో పుష్పరాజ్ అరెస్ట్ బందీ అయ్యాడంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్స్‌లో అల్లు అర్జున్‌- స్నేహా రెడ్డి జోడీ ఒకటి. 2011లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి ప్రేమ బంధానికి గుర్తింపుగా అల్లు అయాన్‌, అల్లు అర్హ పుట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప సినిమాలో అద్భుత నటనకు గానూ ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్‌. ఇప్పుడు ఇదే సినిమా సీక్వెల్‌ పుష్ప 2.. ది రూల్‌లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

అల్లు స్నేహా రెడ్డి గ్లామరస్ ఫొటోస్

అల్లు అర్జున్ తో రొమాంటిక్ గా..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..