Tollywood: ఈ బుడ్డోడు ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవరే.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ కింది ఫొటోలో ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఈ బుడ్డోడు పాన్ ఇండియా హీరో. అన్నట్లు ఇతని భార్య కూడా క్రేజీ హీరోయినే. వీరిది ప్రేమ వివాహం. అయితే ఈ స్టార్ హీరో తండ్రి ఇప్పటికీ బస్ డ్రైవర్ గానే విధులు నిర్వహిస్తుండడం గమనార్హం.

Tollywood: ఈ బుడ్డోడు ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవరే.. ఎవరో గుర్తు పట్టారా?
Actor Childhood Photo
Follow us
Basha Shek

|

Updated on: Nov 08, 2024 | 9:38 AM

సినిమా సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలో తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటికి అభిమానుల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఒక్కోసారి సెలబ్రిటీలు స్వయంగా ఈ ఫొటోలను షేర్ చేస్తుంటే మరి కొన్ని సార్లు వారి సన్నిహితులు కూడా షేర్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు స్వయంగా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫొటో వైరల్ గా మారింది. ఇది ఎవరో మీరు గుర్తించారా? ఇతను కన్నడ ఇండస్ట్రీకి చెందిన పాన్ ఇండియా హీరో. మైసూర్‌లో ఉన్న అతను హీరో కావాలనే కలతో బెంగళూరు వచ్చాడు. అతని తండ్రి బస్సు డ్రైవర్. మొదట బుల్లితెరపై మెరిశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు కేవలం రెండే రెండు సినిమాలతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ పిల్లాడు మరెవరో కాదు కన్నడ రాకింగ్ స్టార్ యష్. కన్నడ చిత్ర పరిశ్రమలో చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్న యష్ ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది అతని చిన్ననాటి ఫొటో. దీనికి చాలా మంది అభిమానుల నుండి కామెంట్స్ వస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘రామాయణం’ విడుదల తేదీ ప్రకటించబడింది: రణ్‌బీర్ కపూర్‌కు బదులుగా యష్ ఫస్ట్ లుక్ అధిక డిమాండ్

బుల్లితెర ద్వారా యష్ ఫేమస్ అయ్యాడు. చాలా టీవీ సీరియల్స్‌లో నటించాడు. ఆ తర్వాత ‘మనసారే’ సినిమా ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మాస్ హీరోగా ఎదిగాడు. ‘కేజీఎఫ్’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ‘కేజీఎఫ్ 2’ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు యష్. ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

భార్య, పిల్లలతో యష్..

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

యష్ సతీమణి రాధికా పండిట్ కూడా ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన. వీరిది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

దీపావళి వేడుకల్లో యష్ ఫ్యామిలీ..

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?