Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? అందం, అభినయం ఉన్నా అదృష్టం లేని హీరోయిన్.. ప్రభాస్, పవన్ సినిమాలపైనే ఆశలు

|

Aug 17, 2024 | 4:36 PM

పై ఫొటోలోని చిన్నారి పెళ్లి కూతురిని గుర్తు పట్టారా? ఎంతో అందంగా ముస్తాబైన ఈ పాప ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. పుట్టింది బెంగళూరు అయినా పెరిగింది హైదరాబాద్ లోనే. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? అందం, అభినయం ఉన్నా అదృష్టం లేని హీరోయిన్.. ప్రభాస్, పవన్ సినిమాలపైనే ఆశలు
Tollywood Actress Childhood Photo
Follow us on

పై ఫొటోలోని చిన్నారి పెళ్లి కూతురిని గుర్తు పట్టారా? ఎంతో అందంగా ముస్తాబైన ఈ పాప ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. పుట్టింది బెంగళూరు అయినా పెరిగింది హైదరాబాద్ లోనే. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ సొగసరికి సరైన అవకాశాలు లేవు. చేతిలో భారీ, క్రేజీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి అసలు ముందుకు కదలడం లేదు. ఫలితంగా ఈ అందాల తార కెరీర్ ఇప్పుడు డోలాయమానంలో పడింది. అయితే ఈ అమ్మడి చేతిలో ఉన్న రెండూ భారీ ప్రాజెక్టులే. అందులో ఒకటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ది కాగా.. మరొకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఈ బెంగళూరు బ్యూటీ స్టార్ హీరోయిన్ల లిస్టులోకి వెళ్లినట్టే. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ బ్యూటీ మరెవరో కాదు నిధి అగర్వాల్. శనివారం (ఆగస్టు 17) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిధి అగర్వాల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే తన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. పై ఫొటో అందులోదే.

నిధి అగర్వాల్ తెలుగు సినిమాల్లో కనిపించి సుమారు రెండేళ్లకు పైగానే అయ్యింది. ప్రస్తుతం ఆమె పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీర మల్లు, ప్రభాస్ కు జంటగా ది రాజాసాబ్ సినిమాల్లో నటిస్తోంది. ఇవాళ నిధి పుట్టిన రోజును పురస్కరించుకుని హరి హర వీర మల్లు సినిమా కీ అప్ డేట్ ఇచ్చింది. సినిమాలో నిధి పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక రాజాసాబ్ సెట్ లో అయితే నిధి అగర్వాల్ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. . డైరెక్టర్ మారుతీతో పాటు మూవీ యూనిట్ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ది రాజా సాబ్ సెట్ లో నిధి అగర్వాల్ బర్త్ డే సెలబ్రేషన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.