ఈ ఫొటోలోని బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్‌ .. క్రేజ్‌లో నెక్ట్స్‌ లెవెల్‌ అంతే.. ఎవరో గుర్తుపట్టారా మరి?

తెలుగులో పవన్‌ తర్వాత అలా స్టైల్‌ అండ్‌ యాటిట్యూడ్‌తో క్రేజ్‌ తెచ్చుకున్న హీరో ఒకరున్నారు. అతను చేసింది కొన్ని సినిమాలే.. పైగా అందులోనూ కొన్ని నిరాశపర్చాయి. కానీ అతని క్రేజ్‌ మాత్రం నెక్ట్స్‌ లెవెల్‌ అంతే. ఈ స్టైలిష్‌ హీరో యాటిట్యూడ్‌కు అభిమానులతో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు.

ఈ ఫొటోలోని బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్‌ .. క్రేజ్‌లో నెక్ట్స్‌ లెవెల్‌ అంతే.. ఎవరో గుర్తుపట్టారా మరి?
Tollywood Hero

Updated on: May 09, 2023 | 6:07 AM

సాధారణంగా హీరోల సినిమాలు చూసి వారికి అభిమానులుగా మారుతారు చాలామంది. మరికొందరు హీరోలు రియల్‌ లైఫ్‌ లైఫ్‌ స్టైల్‌ చూసి ఫ్యాన్స్‌గా మారిపోతారు. ఇంకొందరు హీరోల స్టైల్‌, యాటిట్యూడ్‌ చేసి వారిపై అభిమానం పెంచుకుంటారు. టాలీవుడ్‌ విషయానికొస్తే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు హిట్‌ అయినా, ఫ్లాప్ అయినా అతని పాపులారిటీలో ఏ మాత్రం తేడా ఉండదు. పైగా రోజురోజుకీ అతని క్రేజ్‌ పెరిగిపోతోంది. తెలుగులో పవన్‌ తర్వాత అలా స్టైల్‌ అండ్‌ యాటిట్యూడ్‌తో క్రేజ్‌ తెచ్చుకున్న హీరో ఒకరున్నారు. అతను చేసింది కొన్ని సినిమాలే.. పైగా అందులోనూ కొన్ని నిరాశపర్చాయి. కానీ అతని క్రేజ్‌ మాత్రం నెక్ట్స్‌ లెవెల్‌ అంతే. ఈ స్టైలిష్‌ హీరో యాటిట్యూడ్‌కు అభిమానులతో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో? యస్‌. అతనే యాటిట్యూడ్ కా బాప్‌ విజయ్‌ దేవరకొండ. పై ఫొటోలో ఉన్నది అతనే. ఇవాళ (మే9) అతని పుట్టిన రోజు.

మొదట చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విజయ్‌దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాలోని విజయ్‌ యాటిట్యూడ్‌ చూసి చాలామంది అతనికి అభిమానులుగా మారిపోయారు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత ట్యాక్సీ వాలా, డియర్‌ కామ్రేడ్‌, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌, లైగర్‌ సినిమాలతో స్టార్‌ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్‌ ఇండియా లైగర్‌ సినిమా ప్లాఫ్ అయినా అతని క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. జాన్వీ కపూర్‌, సారా అలీఖాన్‌ వంటి బాలీవుడ్ తారలు విజయ్‌తో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి అనే సినిమా చేస్తున్నాడు విజయ్‌. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఖుషితో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలనుకుంటోన్న విజయ్‌కు మనమూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..