
మనం ఎప్పుడూ చూడని కొందరు ప్రముఖ వ్యక్తుల త్రో బ్యాక్ ఫొటోలు అప్పుడప్పుడు నెట్టింట దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్, సినిమా సెలబ్రిటీల త్రో బ్యాక్ ఫొటోలు, ఛైల్డ్ హుడ్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలా కొన్ని రోజులుగా ఒక ప్రముఖ వ్యక్తి ఫొటో నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. పై ఫొటో అదే. ఇందులో సినిమా యాక్టర్ లాగా డిఫరెంట్ స్టిల్స్ లో పోజులిస్తోన్న ఆ వ్యక్తి ఇప్పుడు బాగా ఫేమస్. అలాగనీ అతను హీరో కాదు. ఆర్టిస్ట్ కూడా కాదు. కానీ అంతకు మించి పాపులారిటీ, ఫేమ్ సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆయన నిత్యం ఏదో ఒక విషయంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. వివాదాల్లోనూ ఇరుక్కుంటుంటాడు. నెటిజన్లతో తిట్లు తిట్టించుకుంటాడు. చాలా మంది ఇప్పటికే ఈ సెలబ్రిటీని గుర్తు పట్టేసి ఉంటారు. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.
గతంలో వేణు స్వామి పలు సినిమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోహన్ బాబు అల్లరి మొగుడు, అలాగే మహేష్ బాబు యువరాజు తదితర సినిమాలకు వేణు స్వామి పూజలు చేయించిన ఫొటోలు గతంలో బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు వేణు స్వామి కొన్ని సినిమాల్లోనూ తళుక్కున మెరిశారు. జగపతిబాబు హీరోగా చేసిన ‘జగపతి’ అనే తెలుగు సినిమాలో గుడిలో పూజారి పాత్రలో కనిపించారు వేణు స్వామి. ఈ సినిమా 2005లో వచ్చింది. అప్పుడు వేణుస్వామి ఎవరనేది పెద్దగా తెలియదు. అలాగే సోషల్ మీడియాకూడా లేదు. దీంతో ప్రేక్షకులు వేణు స్వామిని పెద్దగా గుర్తుంచుకోలేకపోయారు. ఇక మహేష్ బాబు నటించిన ‘అతడు’ చిత్రంలోనూ ఓ పాటలో కనిపించారీ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఇందులోనూ పెళ్లి జరిపించే పురోహితుడిగానే వేణు స్వామి కనిపించారు.
Venu swamy young days photos asalu full mass 😎 pic.twitter.com/d038MgEHKO
— selfiewithtrain (@selfiewithtrain) July 18, 2025
అయితే పై ఫొటోలు మాత్రం ఎప్పుడు, ఏ సందర్భంలో తీసినవో అర్థం కావడం లేదు. కానీ గత కొన్ని రోజులుగా మాత్రం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Venu Swamy in Jagapathi Movie 😂 pic.twitter.com/gJ1s4KjQ61
— AitheyEnti (@AitheyEntii) January 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..