Tollywood: అబ్బాయనుకునేరు.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ .. చేసిన సినిమాలన్నీ హిట్టే.. ఎవరో గుర్తు పట్టారా?

హీరో, హీరోయిన్ అయినా స్క్రీన్ పై అందంగా కనిపించాలంటే ఎంతో కొంత ముఖానికి మేకప్ వేసుకోవాల్సిందే. అయితే సాయి పల్లవి లాంటి కొందరు హీరోయిన్లు మాత్రమే ముఖానికి ఎలాంటి రంగుల్లేకుండా చాలా న్యాచురల్ గా నటిస్తారు. ఈ స్టార్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

Tollywood: అబ్బాయనుకునేరు.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ .. చేసిన సినిమాలన్నీ హిట్టే.. ఎవరో గుర్తు పట్టారా?
Nimisha Sajayan

Updated on: Dec 30, 2025 | 7:27 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఠక్కున చూసి అబ్బాయి అనుకునేరు. ఆ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోయిన్లను తలదన్నేలా బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటోంది. కేవలం సినిమాలే కాదు వెబ్ సిరీసుల్లోనూ మెరుస్తోందీ అందాల తార. ఈ అమ్మడిలో స్పెషాలిటీ ఏంటంటే.. స్టార్ హీరోయిన్ అయినా కమర్షియల్ హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటోంది. మేకప్ లేకుండా న్యాచురల్ యాక్టింగ్ తో వరుసగా హిట్స్ అందుకుంటోంది. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి తైక్వాండో ప్రాక్టీస్ చేసి చేసి బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది. ఇతర హీరోయిన్లలా చేతికొచ్చిన సినిమాలన్నీ చేయకుండా కథా ప్రాధాన్యమున్న చిత్రాలకే ఓటేస్తోందీ అందాల తార. అందుకే దక్షిణాదిలో ఈ స్టార్ హీరోయిన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక నేరుగా తెలుగులో నటించకపోయినా పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. ఇప్పుడు చేతి నిండా సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంటోన్న ఈ అందాల తార మరెవరో కాదు నిమిషా సజయన్.

ది గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, చిన్నా, జిగర్తాండ డబుల్ ఎక్స్, డీఎన్ఏ (తెలుగులో ఓమై బేబీ) తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది నిమిషా. అలాగే పోచర్, డబ్బా కార్టెల్ తదితర వెబ్ సిరీసులతోనూ ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పించింది. ముఖ్యంగా ఈ మధ్యన వచ్చిన డీఎన్ ఏ సినిమాలో నిమిషా నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

నిమిషా సజయన్ లేటెస్ట్ ఫొటోస్..

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది నిమిషా. తరచూ తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేసుకుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తుంటుంది. నిజ జీవితంలో ఎంతో సింపుల్ గా కనిపించే నిమిషా సినిమాల్లోనూ మేకప్ వేసుకోనని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.